మూసీలోకి రోజుకు 10 టన్నుల చెత్త, సవాలుగా మారిన సుందరీకరణ
x

మూసీలోకి రోజుకు 10 టన్నుల చెత్త, సవాలుగా మారిన సుందరీకరణ

కాలుష్యకాసారంగా మారిన మూసీనదీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.మూసీ ఆక్రమణలను తొలగించడం,మూసీలోకి చెత్త చేరకుండా నిరోధించడం పెద్ద సవాలుగా మారింది.


మూసీ సుందరీకరణ పనులకు మూసీ నదిలోకి చేరుతున్న చెత్త, మురుగునీరు పెద్ద సవాలుగా మారింది. ప్రతీ రోజూ మూసీలోకి 10 టన్నుల చెత్త చేరుతుందని మూసీ నదీ అభివృద్ధి సంస్థ గుర్తించింది.మూసీ నదిలోకి చెత్త పారవేయకుండా చూడటంతోపాటు ఆక్రమణలను నివారించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

- మూసీ నదీ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించేందుకు 16వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.
- లండన్ నగరంలో థేమ్స్ నదీ తరహాలో మూసీ అభివృద్ధికి నదిలోకి చేరుతున్న చెత్త తొలగింపు సమస్యగా మారింది. 55 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న మూసీనదిని ప్రక్షాళన చేయడం, ఇందులో పేరుకు పోతున్న చెత్త తొలగింపుపై మూసీ అభివృద్ధి సంస్థ అధికారులు దృష్టి సారించారు.

మూసీలోకి వ్యర్థ పదార్థాలు
మూసీనదిలోకి పరుపులు, ఫర్నిచర్ ముక్కలు, పాత దుస్తులు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి.పురానాపూల్, ముస్లింజంగ్ పూల్, చాదర్ ఘాట్, మూసారం బాగ్ ప్రాంతాల్లోని మూసీలో ప్రతీ రోజూ అధికారులు రోజుకు ఒక టన్ను చెత్తను తొలగిస్తున్నారు. కొందరు నగరవాసులు నేరుగా చెత్తను మూసీలో పారవేస్తున్నారు. మరికొందరు వ్యర్థ పదార్థాలను నాలాల్లో పడేస్తుండటంతో వీటి ద్వారా మూసీలో చెత్త కలుస్తుందని దీన్ని నివారించడం పెద్ద సవాలు మారిందని మూసీనదీ అభివృద్ధి సంస్థ అధికారి ఒకరు చెప్పారు.

ఏజెన్సీలకు చెత్త తొలగింపు బాధ్యత
నాగోలు, పురానాపూల్, శివాజీ బ్రిడ్జి వద్ద చెత్తను తొలగించే బాధ్యతను ఏజెన్సీలకు మూసీ అభివృద్ధి సంస్థ అప్పగించింది. మూసీ నదితోపాటు నాలాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు వీలుగా 8 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. చెత్తనే కాకుండా కుక్కలు, ఇతర జంతువుల కళేబరాలను కూడా మూసీలో వదులుతున్నారని తాజాగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది.


Read More
Next Story