హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు
x

హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు

హైదరాబాద్ నగర అభివృద్ధికి మూలధన వ్యయం కోసం రూ.10,000 కోట్లు కేటాయించామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం కోట్లాదిరూపాయలు కేటాయించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కు వెల్లడించారు. తాము అభివృద్ధి చేస్తున్నా, గత కొన్ని నెలలుగా కొందరు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

- మూసీ నిర్వాసితులకు అందమైన సురక్షితమైన జీవితాన్ని అందించడానికి ముఖ్యమంత్రి,రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం చెప్పారు. శనివారం హైటెక్స్‌లో నెరెడ్ కో నిర్వహించిన ప్రాపర్టీ షోలో భట్టి విక్రమార్క మాట్లాడారు.“హైదరాబాద్ మనది, మనందరికీ చెందినది,ఇది దేశ కిరీటంలో ఒక ఆభరణం,ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతోంది” అని ఆయన పేర్కొన్నారు.

30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
మూసీ నది పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం,30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైడ్రా అనుమతులు ఇచ్చే ఏజెన్సీ కాదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు అంతా హైదరాబాద్‌దేనని చెప్పారు.విమానాశ్రయం నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చునన్నారు.వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఏఐ ప్రాజెక్టులు వస్తాయన్నారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలను గ్రీన్ బెల్ట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు భట్టి చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా కొంత విరామం తర్వాత రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్టర్ల సమస్యలను వినడానికి ఓపెన్ మైండ్‌తో ఉందన్నారు.హైదరాబాద్‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.హైదరాబాద్ నగరం అందరికీ నిలయమని పునరుద్ఘాటించారు.

రియల్టర్లను ఆకర్షించేందుకే అభివృద్ధి పనులు
ఫ్లైఓవర్లు,అండర్‌పాస్‌లు,డ్రైనేజీ వంటి సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్‌లను ఆకర్షించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయని డిప్యూటీ సీఎం చెప్పారు.తాగునీటి సమస్య తలెత్తకుండా గోదావరి,కృష్ణా,మంజీరా నదుల నుంచి తాగునీటిని అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుందని, అంతర్జాతీయ విమానాశ్రయం, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, జేఎన్టీయూ, త్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.

ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ప్రజాభవన్లో ఉద్యోగ జేఏసీ నాయకులు పలు సమస్యలపై కలిసి విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఆయన వారికి భరోసా ఇచ్చారు.డి ఎ లు, ఇతర అంశాలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు వినడానికి, చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు యావత్తు కేబినెట్ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని అన్నారు. కుల గణన విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహకరించి త్వరితన పూర్తి చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీష్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్, జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు తదితరులు ఉన్నారు.



Read More
Next Story