‘సీఎం ఇంట్లో ఇలాంటి గూండా పని చేస్తారా?’ సుప్రీంకోర్టు విస్మయం
x

‘సీఎం ఇంట్లో ఇలాంటి గూండా పని చేస్తారా?’ సుప్రీంకోర్టు విస్మయం

సిఎం అధికారిక నివాసంలోకి ఎవరో ‘గూండా’ ప్రవేశించినట్లు అతడు (బిభవ్ కుమార్) ప్రవర్తించాడు. మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. ఓ యువతితో ఇలా వ్యవహరించాలా? - సుప్రీంకోర్టు ధర్మాసనం


ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మలివాల్‌పై దాడి చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌‌నుద్దేశించి.. ‘‘ఇలాంటి గూండాలే సీఎం ఇంట్లో పని చేస్తారా?’’ అని బిభవ్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఢిల్లీ హై కోర్టు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌ గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం కుమార్ బెయిల్ పిటిషన్‌ను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఇదే సందర్భంలో ఢిల్లీ హైకోర్టు నమోదు చేసిన ఘటన వివరాలను చూసి తాము షాక్ అయ్యామని బిభవ్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో అన్నారు.

కోర్టు ఘాటు వ్యాఖ్యలు..

"రోజూ మేం హంతకులు, కాంట్రాక్ట్ హంతకులు, దోపిడీదారులకు బెయిల్ మంజూరు చేస్తాం. అయితే ఈ కేసులో ఘటన జరిగిన తీరు మమ్మల్మి విస్మయానికి గురి చేస్తుంది.

సిఎం అధికారిక నివాసంలోకి ఎవరో ‘గూండా’ ప్రవేశించినట్లు అతడు (బిభవ్ కుమార్) ప్రవర్తించాడు. మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. ఓ యువతితో ఇలా వ్యవహరించాలా? ఆమె శారీరక పరిస్థితుల గురించి అతనికి (బిభవ్ కుమార్) చెప్పింది. అయినా దాడి చేశాడు.’’ బిభవ్ తరపు న్యాయవాదితో అన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో దాడి..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన తనను.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ దాడి చేశాడని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఛాతీ, కడుపుపై కొట్టాడని, బట్టలు చిరిగిపోయాయని, తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయని ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దాంతో పలు సెక్షన్ల కింద పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేశారు.

హైకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు..

కుమార్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో బిభవ్ కుమార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బిభవ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, విచారణ ముగిసినా కస్టడీలో ఉంచుకున్నారని ఆయన తరపు లాయర్ వాదించారు.

75 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో బిభవ్..

కేజ్రీవాల్ రాజకీయ కార్యదర్శి కుమార్ గత 75 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. ‘‘మే 13న కేజ్రీవాల్ అధికారిక నివాసంలో మలివాల్‌పై దాడి జరిగింది. మే 16న ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. 18వ తేదీ అరెస్టు చేశారు. ఇప్పటికే 75 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. బెయిల్ ఇవ్వండి’’ అని సింగ్వి కోర్టుకు వివరించారు.

Read More
Next Story