గాంధీ గురించి కంగనా పోస్టింగ్‌పై తీవ్ర విమర్శలు
x

గాంధీ గురించి కంగనా పోస్టింగ్‌పై తీవ్ర విమర్శలు

‘దేశ్ కే పితా నహీ, దేశ్ కే తో లాల్ హోతే హై. ధన్యే హై భారత్ మా కే యే లాల్’ - బీజేపీ ఎంపీ కంగనా రనౌత్


బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాలకు కొత్తేమీ కాదు. ఈ సారి సోషల్ మీడియా మరో పోస్టు చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘దేశ్ కే పితా నహీ, దేశ్ కే తో లాల్ హోతే హై. ధన్యే హై భారత్ మా కే యే లాల్ (భారతమాతకు కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. అలాంటి కుమారుల్లో లాల్‌ బహదుర్‌ శాస్త్రి ఉండటం అదృష్టం’ అని తన ఇన్‌స్టాలో ట్వీట్ చేశారు. ఫాలో అప్‌గా దేశంలో పరిశుభ్రతపై గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత మోదీనే దక్కుతుందని మరో పోస్టు పెట్టారు. మహాత్మా గాంధీ, లాల్‌ బహదుర్‌ శాస్త్రీల జయంతి సందర్భంగా ఆమె ఈ పోస్టులు పెట్టారు.

మోదీ స్పందించరా?

కాగా మహాత్మ గాంధీని తక్కువ చేసి చూయించాలన్న ఉద్దేశ్యంతోనే కంగనా ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీజేపీ ఎంపీ కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ గాడ్సే ఆరాధకులు (కంగానా)ను మోదీ క్షమిస్తారా? జాతిపిత ఉన్నారు. కుమారులు ఉన్నారు. అమరవీరులు ఉన్నారు. గౌరవానికి ప్రతి ఒక్కరూ అర్హులే.” అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

‘ఏది పడితే అది మాట్లాడకూడదు’..

రనౌత్ తాజా వ్యాఖ్యలపై పంజాబ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా విమర్శలు గుప్పించారు. ‘‘రనౌత్ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. ఆమె మొదటి నుంచి రాజకీయ రంగానికి చెందిన వ్యక్తికాదు. రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడడం మంచిదికాదు. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఆమె వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

గతంలో ఎదురుదెబ్బ..

2021లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కోరిన రనౌత్‌కు గత నెలలో ఎదురుదెబ్బ తగిలింది. జూన్‌లో ఎంపీగా ఎన్నికైన కంగనా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు “దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి” దారితీస్తాయని పేర్కొన్నారు. అయితే తర్వాత రనౌత్ తన ప్రకటనను ఉపసంహరించుకుంది. రనౌత్ తాను కేవలం కళాకారిణి మాత్రమే కాదు. బీజేపీ ఎంపీ కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Read More
Next Story