నేడు, రేపు ప్రత్యేక రైళ్లను నడపనున్న సెంట్రల్ రైల్వే..
x

నేడు, రేపు ప్రత్యేక రైళ్లను నడపనున్న సెంట్రల్ రైల్వే..

దేశీయంగా రోజుకు 2,300 విమానాలను నడిపే ఇండిగో శుక్రవారం 1,000 కి పైగా విమానాలను రద్దు చేసింది.


Click the Play button to hear this message in audio format

సాంకేతిక కారణాల కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో(IndiGo) విమాన సర్వీసులు రద్దుకావడంతో ప్రత్యేక రైళ్లను నడపాలని సెంట్రల్ రైల్వే (CR) నిర్ణయించకుంది. అందులో భాగంగా డిసెంబర్ 6, 7 తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను తిప్పనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమయితే అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.


ప్రత్యేక సర్వీసులు..

పూణే-SMVT బెంగళూరు (డిసెంబర్ 6), పూణే-న్యూఢిల్లీ (డిసెంబర్ 7), లోకమాన్య తిలక్ టెర్మినస్-మడ్గావ్ (డిసెంబర్ 7), ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-న్యూఢిల్లీ (డిసెంబర్ 6), లోకమాన్య తిలక్ టెర్మినస్-లక్నో (డిసెంబర్ 6), నాగ్‌పూర్-CSMT (డిసెంబర్ 6) మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు (Special Trains) నడుస్తాయని CR చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


దూర ప్రాంత రైళ్లకు అదనపు కోచ్‌లు..

ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా రద్దీని తగ్గించడానికి పశ్చిమ రైల్వే (WR) సుదూర ప్రాంతాలకు వెళ్లే నాలుగు రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు స్వప్నిల్ నీలా తెలిపారు. డిసెంబర్ 6న న్యూఢిల్లీ-లక్నో ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12429)కి, డిసెంబర్ 7న లక్నో-న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12430)కి అదనపు ఎసి 3-టైర్ కోచ్‌ను జత చేయనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 10 వరకు ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12951), సబర్మతి బిజి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12957)కు 5 ఏసీ 2-టైర్ కోచ్‌లు అనుసంధానించనున్నట్లు WR ప్రతినిధి తెలిపారు.


ప్రయాణికుల ఆగ్రహం..

దేశీయంగా రోజుకు 2,300 విమానాలను నడిపే ఇండిగో శుక్రవారం 1,000 కి పైగా విమానాలను రద్దు చేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో గందరగోళం నెలకొంది. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుల్లోనే పడికాపులు కాస్తున్నారు. చాలా మంది ప్రయాణీకులు సోషల్ మీడియాలో తమ కోపాన్ని వెల్లగక్కుతున్నారు. ఇదే సమయంలో కొన్ని విమాన సర్వీసులు రెట్లను భారీగా పెంచేశాయి. దీనిపై కూడా ప్రయాణికుల నుంచి ఆగ్రహ జ్వాలాలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story