వచ్చే నెల నుంచి మాజీ సీఎం యడ్యూరప్ప అక్రమాస్తుల కేసు విచారణ: సుప్రీం
ప్రాసిక్యూషన్ కు మందుస్తు అనుమతి లేకుండా కేసు పెట్టారని వాదనలు
సీఎంగా ఉన్నప్పుడూ ప్రయివేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు భూములు డీ నోటి ఫై చేశారన్న ఆరోపణలపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై దాఖలైన కేసులను వచ్చే నెల 28 నుంచి క్రమం తప్పకుండా విచారణ చేస్తామని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించింది.
ఇంతకుముందు దాఖలైన కేసులో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని, ప్రాసిక్యూషన్(విచారణ)కు అనుమతి లేదని మొదటి కేసును కొట్టి వేసిన సంగతిని జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. దీనిపై రెండో ఫిర్యాదు చేయాలా వద్దా అనే విషయంలోనూ పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
యడ్యూరప్ప తరఫున సీనియర్ న్యాయవాదీ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం 2018 సవరణ ప్రకారం.. మాజీ సీఎం సహ ఇతరులపై నమోదైన క్రిమినల్ కేసును తిరిగి రీ ఓపెన్ చేయమని హైకోర్టు ఆదేశించలేదని గుర్తు చేశారు.
ప్రైవేట్ కేసు
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రయివేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు సేకరించిన భూములను డీ నోటిఫై చేశారని ఆరోపిస్తూ 2012 లో ఆలం పాషా అనే వ్యక్తి ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనం ముందు న్యాయవాదీ ప్రస్తావించారు.
సీఎంను ప్రాసిక్యూట్ చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వలేదనే కారణంతో కేసును హైకోర్టు కొట్టివేసింది. అయితే ఆయన 2014 లో సీఎం పదవి నుంచి దిగిపోగానే రెండో సారి ఫిర్యాదు దాఖలైంది. అయితే అవినీతి నిరోధక చట్టం కింద ముందస్తు అనుమతి అవసరమని ట్రయల్ కోర్టు మరోసారి కేసును 2016 లో కొట్టి వేసింది.
తరువాత పాషా హైకోర్టు ను ఆశ్రయించారు. తరువాత ఈ కేసులను పునరుద్దరించిదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిందని లూత్రా తెలిపారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకుంటూ పిటిషన్లలోని చట్టాల ప్రశ్నను రూపొందించాలని, ప్రతి కేసుపై చిన్న సమర్పణలు దాఖలు చేయాలని లూథ్రాను కోరింది. హైకోర్టు ఆదేశాలలతో ఇవన్నీ 5 సెట్లుగా ఉన్నాయని న్యాయవాదీ తెలిపారు.
కర్నాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదీ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం చట్టానికి సంబంధించిన ప్రశ్నలను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టిపార్టీగా చేయాలని అభ్యర్థించారు. అయితే దీనిని లూథ్రా వ్యతిరేకించాడు.
పిటిషన్ ప్రయివేట్ వ్యక్తితో దాఖలైందని,ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. అయితే ధర్మాసనం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేవలం చట్టం పై మాత్రమే డాక్యుమెంట్లు ఇవ్వడానికి సరేనంది. అలాగే కాగ్ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరారు.
తనపై కేసును విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడం సరికాదని మాజీ సీఎం వాదన. తనపై సీర్పీపీసీ సెక్షన్ 482 ప్రకారం దాఖలైన కేసు కోర్టు తప్పుగా అన్వయించిందని, ప్రభుత్వ ఉద్యోగికి తగిన రక్షణలు ఉన్నాయని వాదించారు.
Next Story