త్రి భాషా విధానం రాజ్యాంగంలో ఎక్కడుంది: స్టాలిన్
x

త్రి భాషా విధానం రాజ్యాంగంలో ఎక్కడుంది: స్టాలిన్

కేంద్ర నిధులు నిలిపివేస్తామని చెప్పడం బ్లాక్ మెయిల్ అని ఆగ్రహం


తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాని అమలు చేసే వరకూ నిధులు నిలిపివేస్తామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ వారణాసిలో శనివారం విలేకరులతో మాట్లాడిన వీడియో క్లిప్ ను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమిళనాడు రాజ్యాంగ నిబంధనలన అనుగుణంగా ఉండాలని, మూడుభాషా విధానం చట్టబద్దమైన పాలన అని ప్రధాన్ చెప్పినట్లు ఉటంకించారు.

బ్లాక్ మెయిల్..
తమిళనాడు మూడు భాషాల విధానాన్ని ఆమోదించే వరకూ కేంద్రం విద్యకు సంబంధించిన నిధులు అందించదని ప్రధాన్ చేసిన వాదనను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఉందని ఆరోపించిన ఆయన, ఇది ఆమోద యోగ్యం కాదని, ప్రజలు దీన్నిసహించరని అన్నారు.

రాష్ట్రం తన హక్కు నుంచి కేంద్రం నుంచి తన వాటా నిధులను కోరుతుంది. రాష్ట్రం వ్యక్తిగత సంపదను క్లెయిమ్ చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి అహాంకారంతో మాట్లాడితే ఆ సందర్భంలో ఢిల్లీ తమిళ వీరత్వానన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇంగ్లీష్, ప్రాంతీయ భాష, హిందీ అనే త్రిభాష విధానాన్ని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారో చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. భారత్, రాష్ట్రాల యూనియన్ గా ఏర్పడిందని, విద్య రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం దానినికే సొంతమైన అంశంగా చెప్పుకోవద్దని అన్నారు.
Read More
Next Story