ఈడీ ఫిర్యాదు లేకుండా కేసులు పెట్టడం ఏంటీ?
x
మద్రాస్ హైకోర్టు

ఈడీ ఫిర్యాదు లేకుండా కేసులు పెట్టడం ఏంటీ?

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సూపర్ కాప్ కాదన్న ధర్మాసనం


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన అధికార పరిధికి మించిన విషయాలను దర్యాప్తు చేస్తోందని, ‘ఈడీ’ సూపర్ ‘కాప్’ మాత్రం కాదని మద్రాస్ హైకోర్టు విమర్శించింది. బొగ్గు కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ చర్యలను సవాల్ చేస్తూ ఆర్కేమ్ పవర్ జెన్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద స్పష్టమైన ‘‘ప్రిడికేట్ నేరం’’ లేకుండా కొనసాగడానికి ఏజెన్సీకి అధికార పరిధి లేదని పేర్కొంటూ న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, వీఎల్ కే నారాయణన్ ఈడీ అటాచ్ మెంట్ ఉత్తర్వును పక్కన పెట్టారు.
పీఎంఎల్ఏ చట్టం కింద ఫిర్యాదు లేకుండానే ఈడీ విచారణ నిర్వహించడం ఏంటని, సంబంధం లేని ఆరోపణలపై దర్యాప్తు చేయడం వల్ల లాభం ఏంటనీ ధర్మాసనం పేర్కొంది.
బొగ్గు కుంభకోణంతో సంబంధం లేదు
చత్తీస్ గఢ్ లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి 2005 లో స్థాపించిన ఆర్కేఎం పవర్ జెన్, మలేషియాకు చెందిన ముదజయ కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్ నుంచి ఈ కేసు పెట్టారు.
సీబీఐ చార్జిషీట్ తరువాత ఈడీ దర్యాప్తు ప్రారంభం అయింది. అయితే నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ రుణాల మళ్లింపుపై ఏజెన్సీ దర్యాప్తు బొగ్గు కుంభకోణంతో సంబంధం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది.
ఈడీ మందుగుండు సామాగ్రి నిల్వ చేస్తుందా?
విజయ్ మదన్ లాల్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు ఉటంకించింది. ఈడీ అధికార పరిధి ప్రిడికేట్ నేరం, నేరపు ఆదాయం ఉనికి పై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ అనేదీ ఏదైన నేర కార్యకలాపాలపై ఇష్టానుసారంగా దాడి చేయడానికి ఒక డ్రోన్ లేదా కదిలే ఆయుధం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆర్కేఎమ్ పవర్ జైన్ కు నిధులు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ప్రభావిత పార్టీల నుంచి ఫిర్యాదు లేకుండానే ఈడీ చర్యలు నాన్ స్టార్టర్ గా పరిగణించారు.
పీఎంఎల్ సెక్షన్ 66(2) ప్రకారం ఈడీ తన దర్యాప్తులో ఇతర చట్టాల ఉల్లంఘనలను వెలికితీస్తే వాటిని దర్యాప్తు అధికారాలను స్వీకరించడానికి బదులుగా తగిన ఏజెన్సీకి సూచించాలని కోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా కాస్ట్ మెమో దాఖలు చేయాలని పిటిషనర్ ను కోర్టు ఆదేశించింది.


Read More
Next Story