రతీష్ కు, ఉదయనిధికి, టాస్మాక్ కు ఉన్న సంబంధం ఏంటీ: అన్నాడీఎంకే
x
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

రతీష్ కు, ఉదయనిధికి, టాస్మాక్ కు ఉన్న సంబంధం ఏంటీ: అన్నాడీఎంకే

తమిళనాడు డిప్యూటీ సీఎం స్నేహితుడి కేంద్రంగానే వేయి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీ


(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)

తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) లో వేయి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏఐఏడీఎంకే నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.
ఈ కుంభకోణంలో ఉదయనిధి స్టాలిన్ స్నేహితుడు అయిన రతీష్ కీలకంగా వ్యవహరించాడని ఆరోపించింది. టాస్మాస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ విశాఖన్ తో వాట్సాప్ లో జరిగిన సంభాషణలు అవినీతి, బయటి వ్యక్తుల ప్రభావానికి గురించి స్పష్టం చేస్తున్నాయని విమర్శించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. రతీష్, ఉదయనిధికి చిన్ననాటి స్నేహితుడు. స్టాలిన్ నెట్వర్క్ లో ముఖ్యమైన షాడో వ్యక్తి. ప్రభుత్వంలో షాడో పవర్ సెంటర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దొరికిన స్క్రీన్ షాట్లు?
టాస్మాక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీకి చెన్నైలోని టాస్మాక్ ఎండీ నివాసం సమీపానికి సమీపంలో ప్రింటెడ్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ లు కనుగొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అందులో ఒకటి జనవరి 7, 2024న జరిగిన చాట్ లలో రతీష్ టాస్మాస్ ఎండీకి నేరుగా సూచనలు ఇస్తున్నట్లు వెల్లడైందని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది. అందులో ‘ఎరికా ప్లాటినం ఎక్స్ ఓ బ్రాందీ ఫ్రెంచ్’ ‘ఎరికా వీఎస్ఓపీ ప్రీమియం ఎక్స్ ఓ బ్రాందీ’ వంటి ఏ మద్యం బ్రాండ్ లు కొనుగోలు చేయాలి, టెండర్లను నిర్వహించాలనే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
పలు ప్రశ్నలు సంధించిన అన్నాడీఎంకే..
టాస్మాక్ కుంభకోణానికి సంబంధించి అన్నాడీఎంకే పలు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించింది. రతీష్ కు ఎవరూ? ఆయని టాస్మాక్ ఎండీకి ఏంటీ సంబంధం, ప్రభుత్వ సంస్థకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరిచ్చారు? ఉదయ నిధి స్టాలిన్ లేదా సీనియర్ డీఎంకే నాయకుడికి మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నాడా? అని డీఎంకే పై విరుచుకుపడింది.
టాస్మాక్ ఎండీ, ఉదయనిధి స్టాలిన్ ఉన్న ఫొటోను రతీష్ స్వయంగా మళ్లీ ఎండీకి పంపారని, ఒక ప్రయివేట్ వ్యక్తి ప్రభుత్వ అధికారిపై ఇంత ప్రభావం ఎవరి ప్రమేయం లేకుండా ఎలా చూపుతున్నారని అన్నాడీఎంకే ప్రశ్నించింది.
‘‘రతీష్ డీఎంకేలో కొత్త అధికార కేంద్రమా?’’ చాట్ లో ప్రస్తావించబడిన ఒక రహస్యమైన వ్యక్తిని ‘‘సర్’’ అంటూ ప్రస్తావించారని, ఆ వ్యక్తికి కుంభకోణానిక ఎలాంటి సంబంధం ఉందని, ఈ కుంభకోణంలో వారి పాత్ర గురించి ఇంకా విచారిస్తే పూర్తి నిజాలు వెలుగు చూస్తాయని అంది.
ఈడీ అధికారులు చెన్నైలోని రతీష్ నివాసానికి చేరుకున్నప్పుడూ అతని జాడ తెలియకుండ పోయిందని వర్గాలు తెలిపాయి.
ఈడీ దర్యాప్తులో ఏమి తేలింది?
టాస్మాక్ పై ఈడీ జరిపిన విచారణలో టెండర్ల తారుమారు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు, వేయి కోట్ల విలువైన మద్యం షాడో వ్యాపారం జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయని ఆరోపణలు ఉన్నాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలయిన దర్యాప్తు లో టాస్మాక్ ఉద్యోగులు, డిస్టిలరీలు, కార్పొరేట్ కార్యాలయాలపై సోదాలు జరిగాయి. ఏప్రిల్ లో ఈడీ టాస్మాక్ ఎండీ విశాఖన్ తో పాటు ఇతర అధికారులను విచారణ కోసం పిలిపించింది.
డీఎంకే ఖండన..
టాస్మాక్ పై ఈడీ జరిపిన విచారణను అధికార డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఒక ప్రకటనలో.. కొనుగోళ్లు, టెండర్లతో సహ అన్ని టాస్మాక్ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు.
బీజేపీతో సహ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి కథనాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. టాస్మాక్ కుంభకోణం గురించి బీజేపీ కూడా గళం విప్పింది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై మార్చిలో నిరసనలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా అనేక మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు అంతటా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న టాస్మాస్ చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికిక ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. అయితే ఇది రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలక పార్టీలు ఎన్నికల ప్రచారాలకు, పార్టీ ఖర్చులకు నిధులు సమకూర్చడానికి దీనిని పాడి ఆవుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుత దర్యాప్తులో 41 కేసులు ఉన్నాయి. అందులో 34 కేసులు అన్నాడీఎంకే హయాం నాటివి కాగా, ఏడు కేసులు డీఎంకే పాలనకు సంబంధించినవని తెలుస్తోంది.


Read More
Next Story