‘దళపతి’కి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి: పళని స్వామి
x
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి

‘దళపతి’కి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి: పళని స్వామి

త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటను చేపట్టబోతున్న మాజీ సీఎం, ఎన్నికల నాటికి అన్ని పార్టీలు అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో చేరతాయన్న అన్నాడీఎంకే అధినేత


వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కంకణం కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి, కోలీవుడ్ స్టార్, తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇందులో భాగంగా ఆయన పార్టీని అన్నాడీఎంకే కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే - బీజేపీ ఇతర పార్టీలతో జట్టుకట్టింది. అయితే బీజేపీతో సైద్దాంతిక విబేధాలు ఉన్నాయని పార్టీ ప్రారంభంలోనే విజయ్ ప్రకటించారు.

చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ‘సేవ్ దీ పీపుల్, రీక్లెయిమ్ తమిళనాడు’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పళని స్వామి సిద్దమవుతున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో, ప్రచారగీతం ఆవిష్కరణ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకేను ఎదుర్కోవడానికి టీవీకే తో సహ అన్ని భావసారూప్య పార్టీలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.
అమిత్ షా ప్రకటన..
తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పళని స్వామి స్పందించారు. బీజేపీ సీనియర్ నాయకులు చేసిన మాటలపై తన అభిప్రాయం చెప్పడం సరికాదని అన్నారు. అయితే 2026 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి తన పేరును అమిత్ షా ఆమోదించారని ఆయన పేర్కొన్నారు.
‘‘బీజేపీ ఢిల్లీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. షా ప్రకటన తరువాత పార్టీలోని ఇతరులు ఏం చెబుతారనేది అప్రస్తుతం.’’ అని పళని స్వామి నొక్కి చెప్పారు. భవిష్యత్ లో ఏ సంకీర్ణంలోనూ అన్నాడీఎంకే నాయకత్వ పాత్ర పోషిస్తుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటన..
జూలై 7న ప్రారంభమయ్యే తన రాష్ట్ర వ్యాప్త పర్యటన తమిళనాడులోని 234 నియోజకవర్గాలను కవర్ చేస్తుందని పళని స్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పాలనలోని ‘‘దౌర్జన్యాలను’’ బహిర్గతం చేయడం, డీఎంకే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాలను అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరించడం ఈ పర్యటన లక్ష్యం.
‘‘డీఎంకే పాలనలో యువతుల నుంచి వృద్దుల వరకూ ఎవరూ సురక్షితంగా లేరు. రోజు మనం చూసే వార్తల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి.’’అని పళని స్వామి అన్నారు.
ప్రజల మద్దతును కూడగొట్టి భారీ మార్పును తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, ఎంజీ రామచంద్రన్, మాజీ నాయకురాలు జే. జయలలితను గుర్తు చేసుకుంటూ ప్రజలను సేవ చేయడంలో పార్టీ వారసత్వాన్ని ఆయన గట్టిగా చెప్పారు.
‘‘అన్నా(ఎంజీఆర్) ప్రజలకు వద్దకు వెళ్లు, వారితో జీవించు, వారి నుంచి నేర్చుకో, వారిని ప్రేమించు’’ అని అన్నాడు. నేను ఎల్లప్పుడు ప్రజల మధ్యే ఉంటాను. వారి గొంతులను వింటాను. వారి మధ్యే ఉంటాను’’ అని ఆయన అన్నారు. తన ప్రజా సేవ కొత్తగా తీసుకొచ్చారనే అధికార పక్ష వాదనలను ఆయన తోసిపుచ్చారు.
డీఎంకే పై విమర్శలు..
రెండు ఆకుల గుర్తుపై జరుగుతున్న చర్చలను కూడా ఆయన తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు ఇప్పటికే అన్నాడీఎంకే కి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పు ఆధారంగా పార్టీ ఇటీవల పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసిందని అన్నారు.
ఎన్నికల్లో గెలవడానికి డీఎంకే తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని విమర్శించారు. తన పర్యటనలో జిల్లా స్థాయిలో నిర్ధిష్ట సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. జనవరిలో కూటమి ప్రణాళికలు ప్రకటిస్తామని అన్నారు. ప్రచారంలో చేరమని కూటమి భాగస్వామ్య పక్షాలను ఆయన ఆహ్వానించారు.
ఇటీవల అన్నాడీఎంకే పై టీవీకే అధినేత విజయ్ చేసిన విమర్శలను ఆయన తేలికగా తీసుకున్నారు. ఇది రాజకీయ ఎదిగే క్రమంలో చేసినవని చెప్పారు. డీఎంకేని గద్దె దించడానికి అన్ని పార్టీలను ఏకం చేయడానికి తన ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
మాదపురంలో ఇటీవల జరిగిన ఆలయ సెక్యురిటీ గార్డు లాకప్ డెత్ ను ఆయన మాట్లాడుతూ.. బాధితుడిని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివగంగకు వెళ్లినప్పుడు కచ్చితంగా అజిత్ కుమార్ తల్లిని కలుస్తానని చెప్పారు.
ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లాకప్ డెత్ లో అధికార పార్టీల వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, బలమైన సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో చేరతాయని ఆయన అంచనా వేశారు.
‘‘మేము మెజారిటీ సీట్లను గెలుచుకుంటాము. అఖండమైన ఆదేశంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము’’ అని ఆయన ప్రకటించడంతో తమిళనాడులో ఒక కీలక రాజకీయ యుద్దానికి వేదిక ఏర్పడింది.


Read More
Next Story