
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
కరూర్ ఘటన బాధ్యులందరూ బయటకు తెస్తాం: సీఎం స్టాలిన్
భవిష్యత్ లో తొక్కిసలాట జరగకుండా నమూనాలు రూపొందిస్తున్నామన్న తమిళనాడు ముఖ్యమంత్రి
కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు ప్రారంభిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ ఘటనలో నిజాలు వెలికితీయడమే కాకుండా, అన్ని స్థాయిలో జవాబుదారీతనాన్ని కూడా నిర్ణయిస్తుందని అన్నారు.
పొలిటికల్ బ్లేమ్ గేమ్..
కరూర్ తొక్కిసలాటపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేసుకోవద్దని ఆయన అందరికి విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ మీటింగ్ లలో తొక్కిసలాట జరగకుండా ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నామని కూడా ఆయన వివరించారు.
‘‘హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రజలకు ఒక హమీ ఇస్తున్నాను. కరూర్ విషాదంపై అన్ని నిజాలను వెలికి తీస్తాం.
అన్ని స్థాయిలలో బాధ్యులను నిర్ధారిస్తాం’’ అని స్టాలిన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.‘‘ఈ కోలుకోలేని విషాదం నేపథ్యంలో రాజకీయ కారణాల వల్ల ఒకరినొకరు నిందించుకోకుండా దీర్ఘకాలిక పరిష్కారం వైపు పయనిద్దాం’’ అని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 27న కరూర్ లో నటుడు రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు ఐపీఎస్ అధికారిణి అస్రా గార్డ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 3న ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు..
కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, అభిప్రాయాలు తమిళనాడు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, వాటిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు. ‘‘కరూర్ లో జరిగిన విషాదంలో మనమంతా బాధపడ్డాం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి ఒక్కరి బాధ చూసి నేను బాధపడ్డాను’’ అని సీఎం అన్నారు.
తమిళనాడు ఆదర్శంగా నిలుపుతాం..
అనేక రంగాలలో దేశానికి ఆదర్శంగా ఉన్న తమిళనాడును తొక్కిసలాట నివారించడంలోనూ దేశానికి దారి చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తొక్కిసలాటను నివారించేందుకు అందరితో చర్చించి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు.
‘‘భారత్ లో అనేక విధాలుగా అగ్రస్థానంలో ఉన్న తమిళనాడు, తొక్కిసలాట నివారించడంలోనూ దేశానికి దారి చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల నిఫుణులు, రాజకీయా పార్టీలు, కార్యకర్తలు, ప్రజలను సంప్రదించి మేము పూర్తి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్ ను రూపొందిస్తాము. ఇది తమిళనాడు మాత్రమే కాదు దేశం మొత్తం కూడా అనుసరించే నమూనాగా మారుతుంది’’ అని ఆయన అన్నారు.
Next Story