
‘పీఎం శ్రీ’ పథకం పై మేము మాట మార్చలేదు: తమిళనాడు ప్రభుత్వం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విమర్శలు చేసిన రాష్ట్ర మంత్రి మహేశ్ పొయ్యమోళీ
మహాలింగం పొన్నుస్వామి
పీఎం శ్రీ పథకం అమలు విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన పార్లమెంట్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.
మంత్రి అన్బిల్ మహేశ్ పోయ్యమోళీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, తాము ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదని అన్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తమను అనాగరికులు అనే ముద్ర వేసిందని అన్నారు.
నిరాధార ఆరోపణలు..
కేంద్రం- తమిళనాడు మధ్య జరుగుతున్న వివాదంపై మంత్రి సమాధానమిస్తూ ‘‘ పీఎం శ్రీ పథకం మేము ఎలాంటి యూటర్న్ తీసుకోలేదు. ’’ అన్నారు. తమ ప్రభుత్వ ఈ వివాదం పై కొత్త కమిటీని నియమించి సమగ్రంగా పరిశీలించాలని మాత్రమే కోరిందని అన్నారు.
ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు లేదా తిరస్కరించినట్లు చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమే అని అన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న జాతీయ విద్యావిధానంపై జరుగుతున్న వివాదాలను రాజకీయం చేసి సమాచారాన్ని తారుమారు చేస్తున్నారు’’ అని కేంద్రమంత్రిని విమర్శించారు.
తాము ఈ పథకాన్ని పూర్తిగా ఆమోదించలేదని కూడా మహేశ్ చెప్పారు. అలాగే తాము చేసిన ప్రతిపాదన తిరస్కరించినట్లు కూడా కాదని అన్నారు. ‘‘ ఇది ఒప్పందం కాదు, శ్రద్ధకు సంబంధించిన విషయం’’ అని మంత్రి అన్నారు.
జాతీయ విద్యావిధానంపై..
జాతీయ విద్యా విధానం.. ప్రకారం మోడల్ పాఠశాలలను సృష్టించే లక్ష్యంతో ఉన్న పీఎం శ్రీ పథకాన్ని వ్యతిరేకించడం ద్వారా తమిళనాడు విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలో పడేస్తోందని కేంద్ర మంత్రి ప్రధాన్ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తమిళ ఎంపీల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్లమెంటేరియన్ల నుంచి నిరసనలకు దారి తీశాయి. ఫలితంగా లోక్ సభ తాత్కలికంగా వాయిదా పడింది.
ప్రధాన్ సభలో చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేదిగా, ప్రజలను విభజించేది ఉందన్నారు. అవమానించే వ్యాఖ్యలకు బదులుగా నిర్మాణాత్మకమైన సంభాషణ జరిపితే బాగుంటుందని సూచించారు.
‘‘ఇటువంటి ప్రకటనలు తమిళనాడు ప్రజల, అక్కడి ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ’’ అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారానికి పరస్పర గౌరవం అవసరమన్నారు. స్టాలిన్ కు తమిళనాడును నడిపే సత్తా ఉందన్నారు.
ఉక్కిరిబిక్కిరి అవుతున్న..
ఈ ఘర్షణ ప్రాంతీయ, కేంద్ర ప్రభుత్వ అధికారుల మధ్య ముఖ్యంగా విద్యా విధానంపై తీవ్రమవుతున్న ఉద్రిక్తతను తెలియజేస్తోంది. తమిళనాడు ఎన్ఈపీ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తుంది. దీనిని హిందీని బలవంతంగా విధించడంగా చూస్తుంది. ద్విభాషా విధానం అమలు చేస్తున్న తమిళనాడుకు జాతీయ విద్యా విధానం కంటగింపుగా ఉంది. ఇక్కడ కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే అమలు చేస్తున్నారు.
Next Story