
టీవీకే అధినేత విజయ్
‘‘వచ్చే ఎన్నికల్లో దుష్టశక్తికి, మంచివారికి మధ్య యుద్దం’’
ఈరోడ్ సభలో టీవీకే అధినేత విజయ్
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేపై టీవీకే అధినేత, దళపతి విజయ్ పదునైన విమర్శలు గుప్పించారు. డీఎంకేని తమిళనాడు దుష్టశక్తిగా అభివర్ణించారు. తన పార్టీని థూయశక్తి(స్వచ్ఛమై శక్తి)గా చెప్పుకోగా, డీఎంకేనీ తీయశక్తి(దుష్టశక్తిగా) అని పేర్కొన్నారు.
ఈరోడ్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ పాల్గొని ప్రసంగించారు. డీఎంకే పెరియార్, అన్నాదురై వంటి ద్రవిద సిద్దాంతవాదుల పేర్లను ఉపయోగించుకుని అవినీతి, దోపిడికి పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘పెరియార్ సూత్రాల పేరుతో దోచుకోకండి’’ అని విజయ్ అన్నారు.
అధికార పార్టీ ఏకైక దృష్టి ప్రజా సంక్షేమం కాదు, విజయ్, టీవీకేలను వికలాంగులను చేయడం వారి లక్ష్యం. డీఎంకే నన్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతోందని, టీవీకేకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్టీ చీఫ్ విజయ్ ఆరోపించారు.
ఎంజీఆర్, పెరియార్, అన్నా రాజకీయాలు..
ఎంజీఆర్, పెరియార్, అన్నా లను తమ విధాన నాయకులుగా అంగీకరించారని విజయ్ అన్నారు. ‘‘అన్నా, ఎంజీఆర్ లను మేము చెప్పుకోలేమని ఎవరూ చెప్పలేరు’’ అని ఆయన చెప్పారు.
అన్నా, ఎంజీఆర్ ఇద్దరూ తమిళనాడు వారసత్వానికి చెందినవారని, మేము వారి రాజకీయ అనుభవాల నుంచి తీసుకున్నామని ఎవరూ ఫిర్యాదు చేయకూడదని ఆయన అన్నారు.
‘‘టీవీకే బలం పెరుగుతోందని డీఎంకే విమర్శలను తోసిపుచ్చిన విజయ్, టీవీకే కి ఏమి కాకపోతే, మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రజలు దీనిని నిశితంగా గమనిస్తున్నారు’’ అని అన్నారు.
‘‘మీరు దోచుకున్న డబ్బు మీ మిత్రుడు, మా బలం ప్రజల అభిమానం’’ అని అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నిలకు టీవీకే రంగంలో ఉన్న పార్టీలను మాత్రమే వ్యతిరేకిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.
‘‘పోటీలో లేనివారిని వ్యతిరేకిస్తూ మేము సమయం వృథా చేసుకోలేము, మాకు చాలా పని ఉంది’’ అని ఆయన బీజేపీ ఇతర చిన్నపార్టీలను విమర్శిస్తూ అన్నారు.
డీఎంకే ఇచ్చిన హమీలను నిలబెట్టుకోలేదని నదుల అనుసంధాన ప్రాజెక్ట్, నదులను శుభ్రపరచడం వంటి వాటిని అసలు ఆచరణలోకి కూడా తీసుకురాలేకపోయారని అదే సమయంలో విచ్చలవిడి ఇసుక తవ్వాలకు అనుమతించారని ఆయన ఆరోపించారు.
సబ్సిడీలకు వ్యతిరేకం కాదు..
సంక్షేమ పథకాలను సమర్థించిన విజయ్ తాను వాటికి వ్యతిరేకం కాదని అన్నారు. అలాగే సబ్సిడీలకు తన మద్దతు ప్రకటించారు. ప్రజల డబ్బును ఉచితాలకు తక్కువ చేసి చెప్పడాన్ని కూడా ఆయన ఖండించారు. అయితే డీఎంకే విధానాలను మాత్రం అనుసరించేది లేదన్నారు.
ఎంజీఆర్, జయలలిత శైలిని అనుకరించిన విజయ్, వారు అన్నట్లుగానే పదే పదే డీఎంకేను దుష్టశక్తిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికలు దుష్ట శక్తి, మంచివారికి మధ్య జరగబోతున్నాయని చెప్పారు.
టీవీకేకు బలం ఇవ్వడానికి సెంగొట్టయన్ లాగే మరికొందరు పార్టీలో చేరతారని విజయ్ ప్రకటించారు. ‘‘సెంగొట్టయన్ లాగా ఇంకా చాలామంది మాతో చేరతారు. మేము వారికి తగిన గుర్తింపు ఇస్తాం’’ అని ఆయన అన్నారు. అలాంటి నాయకులు టీవీకే బలోపేతం చేస్తారని అన్నారు.
‘‘రాజకీయాలు అంటే దిగజారుడు మాటలు కాదు. అధికారం వస్తే ఇలాగే ఉంటాం. మాకు షార్ట్ కట్ రాజకీయాలు లేవు’’ అని విజయ్ అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే విజయ్ అక్కడే ఉంటాడని చెప్పారు.
వేలాది మంది హాజరైన ఈ ర్యాలీ డీఎంకేకు వ్యతిరేకంగా విజయ్ చేస్తున్న దూకుడు ప్రచారాన్ని హైలైట్ చేసింది. 2026 ఎన్నికల్లో టీవీకేను ప్రధాన పోటీదారుగా నిలిపింది.
‘‘పెరియార్ పేరుతో దోపిడి చేసే వారే మా శత్రువులు, మేము వారిని వ్యతిరేకిస్తాము’’ అని ఆయన హర్షధ్వానాల మధ్య తన ప్రసంగాన్ని ముగించారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని విజయ్ అన్నారు.
అన్నాడీఎంకే నాయకత్వం మీద తిరుగుబాటు చేసి ఇటీవల టీవీకేలో చేరిన సెంగొట్టయన్ ఆదేశం మేరకు టీవీకే ఈరోడ్ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ పశ్చిమ తమిళనాడులో టీవీకేకు మొదటిది.
నామక్కల్, కరూర్ లో విజయ్ ప్రచార ర్యాలీ తరువాత దీనిని నిర్వహించారు. సెంగొట్టయన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు జారీ చేసిన షరతులకు లోబడి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మా నాయకుడు విజయ్ ప్రసంగం వినడానికి వచ్చి వారికి ఎటువంటి క్యూఆర్ కోడ్ లు పాస్ లు లేవని అన్నారు.
Next Story

