‘‘అవిశ్వాస తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరలేదు’’
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

‘‘అవిశ్వాస తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరలేదు’’

కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక


ఎల్లుండి నుంచి బెళగావి కేంద్రంగా జరగబోయే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడం గురించి బీజేపీ- జేడీ(ఎస్) సమన్వయ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ అన్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నాయకత్వ మార్పుపై తీవ్ర స్థాయిలో వివాదం రేగిన సందర్భంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ప్రకటించింది.

ఈ సమావేశాలలో ఉత్తర కర్ణాటకకు సంబంధించి కీలక అంశాలు లేవనెత్తుతామని కమల దళం తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 8 న ప్రారంభమై 19 తేదీన ముగుస్తాయి.

‘‘అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంపై బీజేపీ- జేడీ(ఎస్) సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని సూచనలు వచ్చాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి కానీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు’’ అని ఆర్. అశోక్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. బెళగావి సమావేశంలో ఉత్తర కర్ణాటకకు సంబంధించిన అంశాలను చర్చించాలని, కానీ ప్రభుత్వం సాధారణంగా చివరి రోజున వాటిని చర్చకు తీసుకుంటుందని, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటుందని ఆరోపించారు.
‘‘ఉత్తర కర్ణాటక సమస్యలను సమావేశాల ప్రారంభంలోనే చర్చకు స్వీకరించి, సమాధానం ఇవ్వాలని నేను వాయిదా తీర్మానం ప్రవేశపెడతాం’’ అని అశోక అన్నారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందని, బెళగావిలో సమావేశం నిర్వహించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని, అందుకే వరుస సమావేశాలను నిర్వహిస్తుందని విమర్శించారు. ‘‘ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే పార్టీలో ఎవరూ అధికార బదిలీ గురించి మాట్లాడకూడదని, అంతర్గత పోరాటం గురించి మాట్లాడకూడదని, మీడియా ముందు ప్రకటనలు చేయకూడదని అందరూ ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కాంగ్రెస్ శాసనసభ్యులు, నాయకులకు చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే వారు ప్రతిపక్షాలకు భయపడుతున్నట్లేగా. లేకపోతే ఎందుకు అంత సన్నాహాలు. అంటే కాంగ్రెస్ లో విభజన నిజమే’’ అని ఆయన అన్నారు.
రైతులకు ఇప్పటి వరకూ వరద సాయం అందలేదని, ప్రభుత్వం ఇచ్చిన హమీలపై అమలు చేయలేకపోతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతి సమస్యకు కేంద్రాన్ని నిందించడంపై ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
‘‘వరదలు, సహాయ కార్యక్రమాల్లో జాప్యం, ఉత్తర కర్ణాటక సమస్యలు, రైతుల సమస్యలు, శాంతి భద్రతలు, జైళ్లో నిందితులకు రాజభోగాలు, పులులు, ఏనుగుల మృతి వంటి అంశాలను సభలో చర్చకు తీసుకురావాలని సమన్వయ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెళగావి లో 2006 నుంచి సంవత్సరానికి ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బెంగళూర్ రాష్ట్ర సచివాలయమైన విధాన సౌధ నమూనాలో సువర్ణ విధాన సౌధ నిర్మించారు. బెళగావి కర్ణాటక లో భాగమని చెప్పడానికి వీటిని కన్నడ సర్కార్ నిర్వహిస్తోంది.


Read More
Next Story