శరీర రంగుపై ట్రోలింగ్, కేరళ సీఎస్ కంట కన్నీరు!
x
KERALA C.S. Sarada

శరీర రంగుపై ట్రోలింగ్, కేరళ సీఎస్ కంట కన్నీరు!

మన శరీర రంగు మన చేతుల్లో ఉండేదా? దాన్నీ సాటి మనుషులు గేలి చేయాలా? ట్రోల్ చేసి బాధ పెట్టించాలా? ఇదేమి సమాజం. 21వ శతాబ్దంలోనూ తప్పని 'ఆధునిక' వర్ణవ్యవస్థ ఇది.


ఇంతటి ఆధునిక యుగంలోనూ వంటి రంగుకు ఇంత ప్రాధాన్యతా అని ఆశ్చర్యపోకండి. శ్వేత వర్ణానికి సహజంగానే ఆదరణ ఉంటుంది. అంతమాత్రాన నలుపు రంగును అసహ్యించుకోవాల్నా.. అంటరానిదాన్నిగా చూడాల్నా... మీ ఇంటిలో మీకే తెలియని ఒక అపరిచితను చూసినట్టు చూడాలా అని ప్రశ్నిస్తున్నారు కేరళ చీఫ్ సెక్రటరీ శరదా మురళీధరన్. నా చేతిలో లేని దాన్ని గురించి నన్ను అడిగితే నేనేమి జవాబు చెప్పగలను అని ప్రశ్నిస్తున్నారు. కొందరికి సన్నగా ఉంటే నచ్చుతుంది.. మరికొందరికి లావుగా.. అదేంఖర్మో.. నేను ఎలా ఉన్నా ఎవరికీ నచ్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె. రంగుల్లో మెరిసినా .. నలుపూ తెలుపులో నిగనిగలాడినా.. ఏదయినా మూన్నాళ్ళ ముచ్చటే కదా, ఆ మాత్రం దానికి ఇంతగా బాధ పెట్టడం తగునా.. ఇవన్నీ తల్చుకుంటే నాకే సిగ్గేస్తోందని తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు ఆమె.
చీఫ్ సెక్రటరీ అయినా ఆమె శరీర రంగు గురించి అంటున్న మాటలు ఆమెను వెంటాడుతున్నాయి. చివరకు తన భర్త రంగుతోనూ పోలిక తెస్తూ చేసిన పోస్టులు కంటపడ్డాయి. వీటికి ఆమె బదులు ఇచ్చింది. క్రమంలో ఉద్వేగపూరితంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
శారదా మురళీధరన్‌ (Sarada Muraleedharan).. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. కొద్దినెలల క్రితమే కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తన భర్త తర్వాత ఆ స్థానంలో శారద నియమితులవడం విశేషం. వారిద్దరిని గమనించిన పలువురు శరీర రంగు గురించి చేసిన కామెంట్లు ఆమెను బాధించాయి.
‘‘నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేను ఒక పోస్టు చేశాను. ఆ తర్వాత వచ్చిన కామెంట్లతో కాస్త కంగారుకు గురై.. దానిని తొలగించాను. అయితే నేను పేర్కొన్న అంశాలు చర్చించాల్సినవేనని నా శ్రేయాభిలాషులు చెప్పడంతో మళ్లీ తిరిగి షేర్ చేశాను’’ అని తాను డిలీట్ చేసిన మాటలను తిరిగి పంచుకున్నారు.
‘‘ఒక సీనియర్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న భర్తతో పోలికలు తీసుకొచ్చారు. అదేదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టు.. అది అసలు మంచి కాదన్నట్టు.. నా రంగు గురించి మాట్లాడారు. కానీ నలుపును ఎందుకు అవమానించాలి. అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి ముందు కనిపించే చిత్రం. సాయంత్రానికి సూచిక.. అసలు అది లేనిదెక్కడ’’ అంటూ రాసుకొచ్చారు. అలాగే చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. ‘‘ఈ రంగు చిన్నప్పుడే నేను పెద్ద మాటలు పలికేలా చేసింది. మళ్లీ నన్ను తన గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగు సంవత్సరాల వయసులో నేను నా తల్లిని అడిగేంతలా. ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది. నలుపునకు విలువ లేదనే భావనలో తెలుపు పట్ల ఆకర్షితురాలినయ్యా. దానివల్ల నేను తక్కువ వ్యక్తిగా భావించా. కానీ నా పిల్లలు ఆ వర్ణం అద్భుతమని, అందమైనదని నేను గుర్తించేలా చేశారు’’ అంటూ వివరించారు.
వ్యక్తిగతంగా తనకు ఎదురైన అనుభవాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం పట్ల శారద (Sarada Muraleedharan)ను అంతా అభినందిస్తున్నారు. ఆమె గతంలో పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు. కేరళ చరిత్రలో తొలిసారి భర్త నుంచి ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.
Read More
Next Story