
సంక్రాంతి కానుక: రేషన్ కార్డుదారులకు రూ.3 వేలు నగదు.. గిఫ్ట్ హాంఫర్
తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం..
సంక్రాంతి(Pongal) పండుగను పురస్కరించుకుని తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డుదారులకు పొంగల్ కానుకగా రూ. 3 వేలతో పాటు గిఫ్ట్ హాంపర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM Stalin) ఆదివారం (జనవరి 4) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు మొత్తం రూ. 6,936.17 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
గిఫ్ట్‌హ్యాంపర్..
రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు రూ. 3 నగదుతోపాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక పొడవాటి చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు ఉన్న గిఫ్ట్‌హ్యాంపర్ ఇవ్వనున్నారు. అయితే గతేడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే ప్రభుత్వం అందించగా.. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో నగదును కూడా ఇస్తుంది.
ఇంటింటికి టోకెన్లు..
పంపిణీ ప్రక్రియ సులభతరం చేయడంలో భాగంగా జనవరి తొలి వారంలోనే టోకెన్లను రేషన్ షాపు సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయనున్నారు. ఆ టోకెన్‌పై పేర్కొన్న తేదీ, సమయం ఆధారంగా లబ్ధిదారులు.. వారికి కేటాయించిన రేషన్ షాప్‌లకు వెళ్లి నగదుతోపాటు.. గిఫ్ట్‌హ్యాంపర్ కూడా పొందేలా ఏర్పాటు చేశారు.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ఒకవైపు ఎఐఎడిఎంకె-బీజేపీ కూటమి, మరోవైపు విజయ్ కొత్తగా స్థాపించిన టీవీకే పార్టీ గట్టి పోటీ ఇస్తున్నాయి.

