‘‘ఢిల్లీలో అడుగుకో గుంత ఉంది’’
x
డీకే శివకుమార్

‘‘ఢిల్లీలో అడుగుకో గుంత ఉంది’’

అయినా బెంగళూర్ పై విమర్శలు చేస్తున్నారన్నా డీకే శివకుమార్


ఢిల్లీలోని తన ఇంటి ముందు ఉన్న భాగంతో సహ దేశంలోని ప్రతి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రతి వంద మీటర్లకు 50 గుంతలు ఉన్నాయని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.

కానీ బెంగళూర్ లో నివసిస్తున్న కొన్ని స్వార్థ శక్తులు ఇక్కడి రోడ్లపై గుంతలు ఎత్తి చూపుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

బెంగళూర్ లోని కంపెనీలు, గుంతలతో నిండిన రోడ్లపై ప్రజల నుంచి తరుచుగా విమర్శలు వస్తుండటంతో శివకుమార్ ఢిల్లీలో ఉదాహారణను వివరించారు. అక్కడ సప్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని తన ఇంటి ముందు ఉన్న వంద మీటర్ల విస్తీర్ణంలో 50 గుంతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
‘‘దేశంలోని ప్రతి ప్రాంతంలో రోడ్లపై గుంతలున్నాయి. ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని నా ఇంటి ముందు కూడా వంద మీటర్ల పొడవైన రోడ్డుపై 50 గుంతలు ఉన్నాయి. ముంబై లేదా దేశంలోని ఏ ఇతర నగరంలో నైనా గుంతలు ఉన్నాయి’’ అని శివకుమార్ డెక్కన్ హెరాల్డ్ తో చెప్పారు.
‘‘బెంగళూర్ రోడ్లలోని గుంతలను ఎందుకు హైలైట్ చేస్తున్నారు. మీడియా దీనిని హైలైట్ చేసినందుకే. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర తప్ప మరొకటి కాదు’’ అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
సమస్యను లేవనెత్తండి..
బెంగళూర్ రోడ్లను సరిగా నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పారిశ్రామికవేత్తల గురించి అడిగినప్పుడూ ఆయన సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన వారిని కోరారు.
‘‘గుంతల సమస్యను లేవనెత్తిన అన్ని పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పన్నుఆదాయం పరంగా కేంద్ర ప్రభుత్వానికి పంపడంలో కర్ణాటక దేశంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ బెంగళూర్ కు ఎంత డబ్బు ఇచ్చారో దయచేసి కేంద్రాన్ని అడగండి’’ అని బెంగళూర్ ఇన్ ఛార్జీ మంత్రి కూడా అయిన శివకుమార్ అన్నారు.
మరమ్మతుల పనులు..
బెంగళూర్ లోని అన్ని గుంతలను పూడ్చడానికి తాను గడువు ఇచ్చానని ఆయన అన్నారు. ‘‘బెంగళూర్ లోని ప్రతి రోడ్డులోని గుంతల గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి మొబైల్ అప్లికేషన్ ను అభివృద్ది చేయడంం ద్వారా మేము ఒక వ్యవస్థను అభివృద్ది చేశాము.
గుంతలను పూడ్చడానికి నేను గడువు ఇచ్చాను. ముఖ్యమంత్రి ఈ ప్రయోజనం కోసం అదనపు నిధులను కూడా మంజూరు చేశారు. మా వద్ద తగినంత నిధులు ఉన్నాయి. బెంగళూర్ విలువ మాకు తెలుసు. మేము అన్ని రోడ్ల మెరుగుపరుస్తాము’’
సోమవారం బెంగళూర్ లో గుంతలు పూడ్చబడుతున్న చిత్రాలను శివకుమార్ షేర్ చేశారు. ఆయన ఎక్స్ లో ఖాతాలో పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ‘‘బెంగళూర్ లోని వివిధ జోన్లలో గుంతల మరమ్మతు పనులు వేగంగా జరగుతున్నాయి.
వేగం, నాణ్యత, రెండింటిపై దృష్టి కేంద్రీకరించాం. ప్రజలకు సులభ ప్రయాణాన్ని నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం జరుగుతోంది. నగరానికి సురక్షితమైన, నమ్మదగిన రోడ్లను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ట్వీట్ చేశారు.



Read More
Next Story