
‘‘మిగిలిన దక్షిణాదికి హిందీతో పెద్దగా సమస్య లేదు’’
‘‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’’ ఎపిసోడ్ లో ‘ది ఫెడరల్’ ఎడిటర్ శ్రీనివాసన్ విశ్లేషణ
తమిళనాడులో జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాలపై ‘‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’’ ఎపిసోడ్ లో తాజాగా ‘ది ఫెడరల్’ ఎడిటర్ శ్రీనివాస్ తాజాగా జరిగిన ఎపిసోడ్ లో వివరంగా చర్చించారు.
తమిళనాడులో హిందీ వ్యతిరేక ప్రతిఘటన చారిత్రక, సాంస్కృతిక అంశాలలో లోతుగా పాతుకుపోయిందని శ్రీనివాసన్ వివరించారు. ‘‘ద్రవిడ రాజకీయాలకు పునాది హిందీ వ్యతిరేక ఆందోళన’’ అన్నారు.
1930 ల నాటి రాష్ట్ర భాషా ఉద్రిక్తతల మూలాలను ఆయన గుర్తించారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు హిందీ విధించడానికి చేసిన మొదటి ప్రయత్నాలు విస్తృత నిరసనలకు దారి తీశాయి.
ఈ భావన 1940-60ల మధ్య విపరీతంగా పెరిగింది. సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రవిదవాదాన్నిపెంచి పోషించిన నాయకులు హిందీ వ్యతిరేక ఉద్యమాల ద్వారా ప్రాముఖ్యత పొందడానికి ఉపయోగపడిందని అన్నారు.
తమిళులు తమ భాష సంస్కృతం కంటే పురాతనమైన, శాస్త్రీయమైన భాషగా భావిస్తారు. తమిళం పట్ల వారికున్న అనుబంధం బలమైనది. ‘‘తమిళం వేల సంవత్సరాల నాటిది’’ అని వారి భావన అని శ్రీనివాసన్ విశ్లేషించారు.
తిరుక్కురల్, కంబ రామాయణం వంటి రచనలు తమిళ సాహిత్యంలో గొప్పవిగా ప్రతి తమిళుడి హృదయంలో ఒక ప్రతిష్టాత్మక స్థానాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశీ భాషగా హిందీని నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ దానిని విధించే ఏ ప్రయత్నానైనా రాష్ట్రం వ్యతిరేకిస్తుందని దాని వెనక ఈ భాషా గర్వం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీనివాసన్ అన్నారు.
అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఇదే అంశం పై జరుగుతున్న వివరాలను లేవనెత్తారు. ద్రవిడ భాషా మూలాలు ఉన్నప్పటికీ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ద్రవిడ భాషా మూలాలు ఉన్నప్పటికీ హిందీపై వ్యతిరేకత ఇక్కడ ఉన్న స్థాయిలో లేదని అన్నారు.
‘‘కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో తమిళనాడు మాదిరిగానే హిందీని ఎందుకు ప్రతిఘటించట్లేదు? ఈ ప్రాంతాలలో ప్రత్యేకమైన భాషా, సాంస్కృతిక, రాజకీయ కారణాలు ఉన్నాయని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎందుకు హిందీ వ్యతిరేకత లేదు..
కేరళలో అధిక అక్ష్యరాస్యత రేట్లు, ప్రపంచ వలసలు విస్తృత ద్విభాషావాదానికి దారితీసిందన్నారు. చాలామంది మలయాళీలు అనర్గళంగా హిందీ మాట్లాడతారు. రాజకీయంగా కేరళ హిందీని విధించడానికి వ్యతిరేకిస్తున్నప్పటికీ గణనీయమైన ప్రతిఘటన లేకుండానే త్రిభాషా సూత్రాన్ని స్వీకరించింది.
దేశంలో భాషా ప్రాతిపదికగా మొదటి సారిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్.. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తుందని ఎడిటర్ అన్నారు. అయితే తెలుగు లో ప్రాంతీయ అభిమానం ఉన్నప్పటికీ భాషా సమస్యలు తమిళనాడులో లాగా రాజకీయం చేయబడలేదు. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ లో హిందీ విషయంలో ఎక్కడా కూడా వ్యతిరేకత లేదన్నారు.
భయమే కీలక సమస్య..
శ్రీనివాసన్ చెప్పినట్లుగా తమిళనాడులో ప్రధాన సమస్య హిందీ పట్ల అయిష్టత కాదు. దాని రుద్దడం పట్ల భయం ఉందన్నారు. హిందీ రావడం వల్ల తమ భాష గుర్తింపు పోతుందని భయపడుతున్నారని అన్నారు.
Next Story