కర్ణాటక: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే విడుదల
x
హెచ్ డీ రేవణ్ణ

కర్ణాటక: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే విడుదల

హెచ్ డీ రేవణ్ణను విడుదల చేయాలన్న కోర్టు


గత ఏడాది లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జేడీ(ఎస్) సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హసన్ జిల్లాలోని హోలెనరసీపూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నుంచి రేవణ్ణ ను 12 వ అదనపు చీఫ్ జ్యూడిషీయల్ మేజిస్ట్రేట్ కేఎన్ శివకుమార్ విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

‘‘నిందితుడు నెం.1 యూ/సెక్షన్ 473. సీఆర్పీసీ పై ఆరోపించబడిన నేరానికి సంబంధించిన ఫిర్యాదు చేయడంలో లేదా ప్రాసిక్యూషన్ ప్రారంభించడంలో జాప్యాన్ని క్షమించడానికి ఇది సరైన కేసు కాదు. దీనిప్రకారం నిందితుడు ఐపీసీ సెక్షన్ 354ఏ కింద శిక్షార్హమైన నేరాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరిస్తుంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
దీని ఫలితంగా ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 354ఏ కింద నమోదైన నేరం నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు తనపై నమోదైన లైంగిక నేరాల కేసును కొట్టివేయాలని రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కర్ణాటక హైకోర్టు.. బాధితులు ఫిర్యాదు చేయడానికి నాలుగు సంవత్సరాల జాప్యాన్ని ఎలా చూడాలనే అంశాన్ని ట్రయల్ కోర్టుకే బదిలీ చేసింది.
రేవణ్ణ కుమారుడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తన దగ్గరకు అవసరానికి వచ్చిన మహిళలను లైంగిక వేధించడమే కాకుండా, వారితో జరిపిన శృంగారాన్ని వీడియో తీసేవాడు.
ఈ అంశంపై కూడా కేసు నమోదు అయింది. ఇదే సమయంలో రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ప్రజ్వల్ రేవణ్ణపై కేసు పెట్టిన వారే ఈ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణపై నాలుగు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఒకదానిలో ఇప్పటికే దోషిగా తేలింది.
ఏప్రిల్ 26, 2024 న లోక్ సభ ఎన్నికల్లో జరగనున్న హసన్ లో ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయ్యాయి. దీనితో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Read More
Next Story