గవర్నర్ పదవిని రద్దు చేయాలని కోరబోతున్నా డీఎంకే..!
యూజీసీ నిబంధనలు నిలుపుదల, బడ్జెట్ లో ఎక్కువ నిధులు సాధించడమే లక్ష్యమన్న ఆ పార్టీ ఎంపీలు
ప్రమీలా కృష్ణన్
ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి వివిధ రాష్ట్రాల ఎంపీలు సిద్ధం అయ్యారు. కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు సాధించడం, గవర్నర్ల ప్రవర్తనకు నియమాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు నిర్ణీత సమయంలోగా సంతకాలు పెట్టాలని కోరడం వంటివి వారి ఎజెండాలో ఉన్నాయి.
డీఎంకే కు సంబంధించిన పార్లమెంట్ ఎంపీలు అందరూ బుధవారం చెన్నైలో సమావేశం అయ్యారు. అందులో ఆరు అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా గవర్నర్ బిల్లులపై సంతకాలు పెట్టే విషయానికి సంబంధించి కచ్చితంగా టైమ్ ఫ్రేమ్ విధించాలని అంటున్నారు.
గవర్నర్ రవిపై ఆరోపణలు..
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్ రవిని డీఎంకే పార్టీ విలన్ గా చూస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆయన కచ్చితంగా నిర్ణీత సమయంలోగా ఆమోదించాలని పట్టుబడుతోంది. తన గవర్నర్ విధులను విడిచిపెట్టి తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే పనిని తీసుకొస్తున్నారని, ముఖ్యంగా రైట్ వింగ్ ఆలోచనలను ప్రచారం చేస్తున్నారని డీఎంకే ఆరోపణ.
అసలు గవర్నర్ పదవే రద్దు చేయమని డీఎంకే వాదన. అలాగే మెట్రో రైలు, విపత్తు ఉపశమనం వంటి కీలకమైన ప్రాజెక్ట్ లకు మునుపటి బడ్జెట్ నిధులు రాలేదని వాటిని ప్రస్తుతం కేటాయించి విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
గవర్నర్ తన రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమై తమిళనాడు కొత్త రాజకీయాలను తెరతీస్తున్నారని అనేక సందర్భాలను వారు ఉదహరిస్తున్నారు. సెషన్ లో గవర్నర్ పదవిని రద్దు చేయవలసిన అవసరాన్ని హైలైట్ చేయాలని ఎంపీలు నిర్ణయించారు.
తమిళనాడు లో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా వైస్ ఛాన్స్ లర్ నియామాకాన్ని అడ్డుకుంటున్నారని, విశ్వ విద్యాలయాలకు నాయకత్వం లేకుండా పోయిందని అదే సమయంలో బీజేపీ నాయకులను ఇదే సంస్థలలో రాజకీయ ప్రసంగాలు చేయడానికి అనుతిస్తున్నారని పేర్కొన్నారు.
‘‘బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడమే ఏకైక ఎజెండా. గవర్నర్ రవికి తమిళనాడు అభివృద్ధి, దాని సంక్షేమ లేదా దాని గొప్ప సంస్కృతిపై ఆసక్తి లేదు. రాజ్యాంగంలో కూడా అతను సమర్థిస్తానని ప్రమాణం చేశాడు. అయితే అతని దృష్టి మితవాద, ప్రజా వ్యతిరేక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం.
గవర్నర్ పదవిని రద్దు చేసే వరకూ ఆ పదవి గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలి. గవర్నర్ లు తమ పాత్రను నిర్వచించడానికి ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఫైళ్లు, బిల్లులపై సంతకం చేయడానికి నిర్ణీత కాలపరిమితిని తప్పనిసరిగా చేయాలి’’ అని తీర్మానంలో పేర్కొంది.
డీఎంకే పరువు
గవర్నర్ కు సంబంధించిన తీర్మానం బడ్జెట్ సమావేశాలపై ఎలా ప్రభావం చూపుతుందని డీఎంకే ఎంపీ కనిమొళిని ప్రశ్నించినప్పుడూ.. ‘‘ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ ముందు పార్లమెంట్ లో హౌజ్ లోని చాంబర్ లో ప్రసంగిస్తారు.
కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన సందేశాన్ని ఆమె చదువుతారు. అదే విధంగా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సందేశాన్ని కూడా గవర్నర్ చదవాలి. అలాకాకుండా అతను మా ప్రభుత్వం పరువు తీస్తునే ఉన్నాడు. తన విధులను నిర్వహించడంలో విఫలమయ్యాడు. కాబట్టి ఈసారి సెషన్ లో నిధులు కోరకుండా ఈ అంశాన్ని లెవనెత్తాలనుకుంటున్నాం’’ అని వివరించారు.
తీర్మానంలో సంప్రదాయాలను పాటించేందుకు రవి నిరాకరించడాన్ని కూడా డీఎంకే ఎంపీలు ఎత్తి చూపారు. ‘‘ తమిళనాడులో గవర్నర్ రాష్ట్ర శాసనసభలో భాగం. అయినప్పటికీ అతను దాని సంప్రదాయాలను విస్మరించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడంలో జాప్యం చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించాడు. సంస్కృతం, హిందీని కీర్తిస్తూ, తమిళ్ తాయ్ వజ్తు( తమిళ గీతం) ని అణగదొక్కాడు. గవర్నర్ పదవికి రద్దుకు ఇదే తగిన సమయం’’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
విపత్తు నిర్వహణ..
తమిళనాడులో విపత్తు నిర్వహణకు సంబంధించి తక్షణ నిధులు అవసరమని కూడా డీఎంకే ఎంపీలు చర్చించారు. ఫెడరల్ తో మాట్లాడిన కనిమొళి తమిళనాడులో మౌలిక సదుపాయాలు, విపత్తు సమాయ చర్యల ప్రాముఖ్యతను గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పించేందుకు పార్టీ ప్రయత్నాలను వివరించారు.
‘‘మేము వ్యక్తిగతంగా ఆర్థికమంత్రికి పరిస్థితిని వివరించాము. మా ఎంపీలు నేరుగా ఆమె ముందే నిరసనకు దిగారు. గత బడ్జెట్ లలో రాష్ట్రాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారనే దానిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరించారు. సీఎం కూడా లేఖలు రాశారు. కాబట్టి ఈ సారి కేంద్ర బడ్జెట్ లో న్యాయమైన వాటా ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని కనిమొళి అన్నారు.
ఆర్థిక వివక్ష
డీఎంకే ఎంపీలు పన్ను రిటర్న్ లలో అసమానతలను పేర్కొంటూ ఆదాయాన్ని పంచుకోవడంలో తమిళనాడుతో ఆర్థిక వివక్షను కూడా ఎత్తి చూపారు.
‘‘కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రత్యక్ష పన్ను కింద రూ. 100 జమచేస్తే మాకు 29 మాత్రమే తిరిగి వస్తున్నాం. ఈవిధంగా తమిళనాడు ప్రజలు ఆర్థికంగా వివక్షకు గురవుతున్నారు. ఈ వివక్ష రాబడి భాగస్వామ్యం, సబ్సీడీలను కూడా విస్తరించింది. రాబోయే బడ్జెట్ లో తమిళనాడుకు పెండింగ్ లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్ట్ లు, విపత్తు నివారణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు కేటాయించాలి’’ అని ఎంపీలు సమావేశంలో అన్నారు.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న ఢిల్లీ లో డీఎంకే విభాగం, ఎంపీలు నిర్వహించనున్న నిరసన గురించి సమావేశంలో ఆమోదించిన మరో కీలక తీర్మానం. ముసాయిదా మార్గదర్శకాలు విద్యారంగంలో ఫెడరలిజం, రాష్ట్ర హక్కులను నిర్వీర్యం చేస్తాయని, అందువల్ల ఉన్నత విద్య మొత్తం ప్రభావితం అవుతుందని ఎంపీలు పేర్కొన్నారు.
Next Story