కాంగ్రెస్ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన అదానీ గ్రూపు
x
గౌతమ్ అదానీ

కాంగ్రెస్ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన అదానీ గ్రూపు

బెంగళూర్ సొరంగ మార్గం ప్రాజెక్ట్ లో అతి తక్కువ బిడ్డర్ దాఖలు చేసిన సంస్థ, జాతీయ స్థాయిలో గౌతమ్ అదానినీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ


చంద్రప్ప. ఎం

బెంగళూర్ దీర్ఘకాలిక ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి సంజీవనిలా భావిస్తున్నా ప్రతిష్టాత్మక రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్ టెండర్ లో అదానీ గ్రూప్ అత్యల్ఫ బిడ్డర్ గా నిలిచింది. దీనితో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిలో ఇరుక్కుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి గౌతమ్ ఆదానీని తరుచుగా రాహుల్ గాంధీ విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కు దక్కితే కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై విమర్శలు చెలరేగే అవకాశం ఉంది.
ఇక్కడ వ్యంగ్యమైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పాలించిన ఈ రాష్ట్రాలలో అదానీ గ్రూప్ అన్ని రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. ఇక్కడ కూడా బిడ్లను పరిశీలించిన కాంగ్రెస్ సర్కార్ కు తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
బిడ్ ను తీసుకోవడం తప్పనిసరి కాదా?
అదానీ గ్రూప్ అత్యల్ప బిడ్ ను దాఖలు చేసినందున (ఎల్ వన్- అత్యల్ఫ ధరను కోట్ చేసే కంపెనీ) కాంట్రాక్ట్ ఇవ్వడం తప్పనిసరి కాదు. టాటా సెల్యూలార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(1994), జగదీష్ మండల్ వర్సెస్ ఒడిశా రాష్ట్రం(2007) వంటి తీర్పులలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
టెండర్ ప్రక్రియలో, టెండర్ షరతులకు అనుగుణంగా కాంట్రాక్ట్ లను ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే విచక్షణ ప్రభుత్వానికి ఉందని, కోర్టులు సాధారణంగా అలాంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదని కోర్టు పేర్కొంది.
ఈ తీర్పు ప్రకారం అదానీ గ్రూపుకు కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా టెండర్ ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ జర్నలిస్ట్ కే. గిరి ప్రకాశ్ ‘ది ఫెడరల్ కర్ణాటక’తో అన్నారు.
అదానీ గ్రూపు సౌర విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఓడరేవు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టింది. ఈ రంగంలో దానికి ప్రత్యక్ష అనుభవం ఉందని చెప్పడం కష్టం.
ఎందుకంటే అనేక కంపెనీలు ఉన్నప్పటికీ ఆ గ్రూప్ ఇప్పటికే అనేక సంస్థలను నిర్మించడం కంటే కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఫలితంగా సొరంగం రోడ్డు నిర్మాణంలో దాని నైపుణ్యాన్ని స్పష్టంగా చెప్పలేము. అదానీ గ్రూప్ ఇప్పటి వరకూ సొరంగం రోడ్డు ప్రాజెక్ట్ లను అమలు చేసిన ఉదాహారణలు లేవు.
కర్ణాటక అదానీ గ్రూపు పెట్టుబడులు..
గౌతమ్ అదానీ యజమాన్యంలోని కంపెనీలు ఇప్పటికే కర్ణాటకలో రూ.20,000 కోట్లకు పెట్టుబడి పెట్టాయి. 2022, 2029 వరకు రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గ్రూప్ ప్రకటించింది.
అదానీ గ్రూప్ కర్ణాటకలో పునరుత్పాదక ఇంధనం, సిమెంట్, విమానాశ్రయాలు, ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్ట్ లు, నగర గ్యాస్ పంపిణీ, తినదగిన నూనె( అదానీ విల్మార్), రవాణా, లాజిస్టిక్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టింది.
ఉడిపి థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యంలోని అదానీ ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో 1600 మెగావాట్ల పెంచడానికి రూ. 11,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది.
అదానీ విమానాశ్రయాలు మంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునీకరణ, విస్తరణను చేపట్టాయి. అదానీ విల్మార్ ఒక ఆహార ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఏసీసీతో సహ రాష్ట్రంలోని నాలుగు సిమెంట్ ప్లాంట్లలో ఈ సమూహం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులకు పైగా ఉంది.
ఈ బృందం రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రదేశాలలో దాదాపు 1100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటోంది. సౌర, అదానీ గ్రీన్ ఎనర్జీ కింద, పావగడ వద్ద 350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబోతోంది.
రాష్ట్రంలోని 11 కీలక ప్రదేశాలలో సీఎన్జీ స్టేషన్లు కూడా స్థాపించబడ్డాయి. 50 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి 2025 లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న అదానీ గ్రూపు కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది.
‘‘బెంగళూర్ సొరంగం రోడ్డు ప్రాజెక్ట్ కు అదానీ గ్రూప్ అతి తక్కువ బిడ్ దాఖలు చేసినందున, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వవలసి రావచ్చు. డబ్బు సంపాదించే విషయంలో కాంగ్రెస్, బీజేపీ వేరువేరుగా లేవు.
సొరంగం ప్రాజెక్ట్ ను మొదటి నుంచి వ్యతిరేకించిన బీజేపీ, ఇప్పుడు కాంట్రాక్ట్ అదానీ గ్రూప్ కు వెళ్లవచ్చని తెలిసి మౌనంగా ఉంది. అదానీ పై కాంగ్రెస్ వ్యతిరేకత కేవలం పైకి మాత్రమే. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, బడా కంపెనీల మధ్య సంబంధానికి ఇది రుజువు’’ అని కేఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు రవికృష్ణ రెడ్డి ‘ది ఫెడరల్’ కర్ణాటకతో అన్నారు.
ప్రధాని మోదీ అండతోనే అదానీ గ్రూపు అన్ని రంగాలలో వేగంగా విస్తరించిందని అంబానీకి పోటీగా ఎదిగిందని ఆయన ఆరోపించారు.
గౌతమ్ అదానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతున్నాడు. పెద్ద ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే, వారి మధ్య అరుదుగా విభేదాలు ఉంటాయి. డబ్బు పంపిణీ విషయంలో మాత్రమే విభేదాలు ఉంటాయి.
తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా అదానీ గ్రూపు ప్రధాన ప్రాజెక్ట్ లను అమలు చేస్తోందని కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే అలాంటి ప్రాజెక్ట్ లను వారికి మంజూరు చేయవద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ కూడా అదానీ గ్రూపు నుంచి ప్రయోజనం పొందుతుందని అందుకే వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఓ మంత్రి ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలు ఒక విషయం, అభివృద్ధి మరొక విషయం. పారిశ్రామికవేత్తలు ప్రాజెక్ట్ టెండర్లలో పాల్గొనడం చట్టవిరుద్దం కాదు’’ అన్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, గౌతమ్ అదానీపై పదే పదే విమర్శలు చేయడం ప్రస్తుత గందరగోళానికి ప్రధాన కారణంగా ఆయన చెప్పారు.
కేపీసీసీ ఆఫీస్ బేరర్ ఒకరు మాట్లాడుతూ.. పేరు వెల్లడించడానికి ఇష్టపడని పరిస్థితిపై మాట్లాడుతూ.. అదానీ అంశం ఒక విధంగా గందరగోళానికి కారణమైంది. కానీ ఆయన అత్యల్ఫ బిడ్ ను సమర్పించిన సమర్థుడైన పారిశ్రామికవేత్త కాబట్టి దానిని పూర్తిగా తిరస్కరించడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదు. ఇది నిజంగా కాంగ్రెస్ కు ఒక రకమైన అగ్ని పరీక్ష’’ అన్నారు.
సిమెంట్ తయారీలో..
అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలో కూడా తన ఉనికిని క్రమంగా విస్తరిస్తోంది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్ తో పాటు కలబురిగి జిల్లాలోని షహాబాద్ లోని జేపీ అసోసియేట్స్ ప్లాంట్ ను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2006న ఏసీసీ సిమెంట్ కంపెనీ పేరును అదానీ సిమెంట్ గా మార్చారు.
కర్ణాటక లోని ఏసీసీ సిమెంట్ ప్లాంట్లు బెళగావి జిల్లాలోని వాడి వద్ద, చిక్కబళ్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్ తాలుకాలోని తొండేభావి గ్రామంలో ఉన్నాయి. 2024 చివరిలో ఈ బృందం కలబురిగిలోని చిత్తాపూర్లో ఓరియంట్ సిమెంట్ ను కూడా కొనుగోలు చేసింది.
అంచనా వ్యయం కంటే బిడ్ మొత్తం ఎక్కువ..
బెంగళూర్ సొరంగం రోడ్డు ప్రాజెక్ట్ లోని రెండు ప్యాకేజీలకు అదానీ గ్రూప్ అత్యల్ఫ బిడ్లను సమర్పించింది. అయితే ప్రభుత్వ అంచనా వ్యయం కంటే 24 నుంచి 28 శాతం ఎక్కువగా ఉన్నందున ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఖర్చు పెంపుపై మంత్రివర్గ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
హెబ్బాల్ లోని ఎస్టీమ్ మాల్ నుంచి సిల్క్ బోర్డు వరకూ 16.57 కిలోమీటర్ల పొడవైన సొరంగం రోడ్డు నిర్మాణ బాధ్యతను నిర్వహిస్తున్న బెంగళూర్ స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రచ్చర్ లిమిటేడ్ ఈ టెండర్ ను పిలిచింది.
అదానీ గ్రూపుతో పాటు, దిలీప్ బిల్డ్ కాన్, విశ్వ సముద్రం ఇంజనీరింగ్, రైల్ వికాస్ నిగమ్ లిమిటేడ్ కూడా బిడ్లు దాఖలు చేశాయి. అయితే ఇటీవల రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, విశ్వ సముద్రం ఇటీవల నిర్మించిన ప్రాజెక్ట్ లు కూలిపోయాయి. కాబట్టి అవి అనర్హత సాధించాయి.
కర్ణాటకలో పెట్టుబడి..
2022 లో జరిగిన ఇన్వెస్ట్ కర్ణాటక గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, ఫిబ్రవరి 2025 లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్లు మీట్ లో అదానీ గ్రూప్ కర్ణాటకలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది.
కర్ణాటక పరిశ్రమలకు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని అందిస్తుంది. ప్రపంచ వ్యాపారంలో ముఖ్యమైన కేంద్రంగా అవతరించింది. ఈ కారణాల వల్ల గ్రూప్ రాష్ట్రంలో సిమెంట్, విద్యుత్, నగర గ్యాస్, చమురు, రవాణా, లాజిస్టిక్స్, డిజిటల్ రంగంలో పెట్టుబడి పెడుతోందని అదానీ గ్రూప్ సీఈఓ, గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు..
ఈ సంవత్సరం చివరి నాటికి మాలూర్ ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపోను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లాజిస్టిక్స్, కార్గో హ్యండ్లింగ్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
అదానీ కర్ణాటక సోలార్ పీవీ పార్క్ ప్రాజెక్ట్ కింద 132. 62 మిలియన్ల అంచనా పెట్టుబడితో 190 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తున్నారు. కొప్పల్ లో 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉంది.
అదానీ గ్రూప్ విద్యుత్ నిల్వ సాంకేతికత, బ్యాటరీ తయారీలో కూడా తన పెట్టుబడులను విస్తరిస్తోందని పరిశ్రమల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘ది ఫెడరల్’ కు తెలిపారు.
అదానీ గ్రూప్ ఇప్పటికే కర్ణాటక తన ప్రాధాన్యత పెట్టుబడి గమ్యస్థానంగా మార్చుకుందని, రాష్ట్ర దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధిలో కీలక భాగస్వామిగా అవతరించిందని అధికారి తెలిపారు.


Read More
Next Story