
స్టాలిన్ కు తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై
హిందీలో శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని నోటీస్ చేసిన ముఖ్యమంత్రి
తమిళనాడులో త్రిభాష విధానంపై వాదోపవాదాలు చర్చలు జరుగుతున్న తరుణంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు విషయం కూడా రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ మూడు భాషలలో అంటే తమిళం, ఇంగ్లీష్, తెలుగులో పేస్ బుక్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కొన్ని రోజులుగా స్టాలిన్ నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీలో భాగంగా త్రిభాష విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే కేంద్ర విధానం పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా సౌందరరాజన్ శుభాకాంక్షలకు ఆయన సమాధానమిస్తూ త్రి భాషపై తమిళనాడు వైఖరిని తెలియజేశారు. ఎవరూ ఎన్ని ప్రయత్నాలు చేసిన హిందీ బలవంతంగా అమలు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు.
స్టాలిన్ ఏమన్నారంటే..
‘‘బీజేపీ నాయకురాలు నా ప్రియమైన సోదరి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మూడు భాషలలో శుభాకాంక్షలు తెలిపారు. మూడు భాషల విధానాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నమో వివరిస్తూ నేను చాలాసార్లు మాట్లాడాను.
తమిళం, ఇంగ్లీష్, తెలుగు భాషలలో నాకు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా ఆమె తన వ్యక్తిగత అభిమానాన్ని, పార్టీ సిద్దాంతాన్ని వ్యక్తం చేసింది. ఆమె సందేశానికి నేను హృదయాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ’’ అని స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అయితే ఆసక్తికరంగా ఆమె శుభాకాంక్షలు హిందీలో లేవని స్టాలిన్ అన్నారు. అది తమిళనాడులో ప్రబలంగా ఉన్న హిందీ వ్యతిరేక సెంటీమెంట్ ను ప్రతిబింబిస్తుందని అన్నారు.
నాకు మొదట తమిళం, ఇంగ్లీష్, తరువాత తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళనాడులో పుట్టిన నాకు తెలుగు రాదు. నేను ఎప్పుడూ దానిని చదవలేదు.
తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై కాలక్రమేణ తెలుగును ఎంచుకుని ఉండవచ్చు. కానీ ఆమె బలవంతంగా పాఠశాల విద్య ద్వారా దానిని నేర్చుకోలేదు. ఆమె అనుభవం ద్వారా సహజంగానే దానిని సంపాదించుకున్నారని అన్నారు.
బలవంతంగా విధించకూడదు..
ద్రవిడవాద భావజాలాన్నిఉద్దేశిస్తూ స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఉదాహరణ ద్రవిడ ఉద్యమ వైఖరిని బలపరుస్తుంది. ఏ భాషను బలవంతంగా రుద్దకూడదు. అది అవసరమని భావించారు.
అవసరమనుకుంటే స్వయంగా అదనపు భాషను నేర్చుకుంటారు. నన్ను మూడు భాషల్లో పలకరించడం ద్వారా తమిళి సై అనుకోకుండా మూడవ భాష విధించడాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ‘‘తగైసల్ తమిళర్’’ అవార్డుతో సత్కరించబడిన గౌరవనీయమైన తమిళ పండితురాలు కుమారి అనంతన్ కుమార్తె తమిళి సై అని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.
Next Story