
తమిళనాడు: ప్రచారంలో ఎవరూ ముందున్నారు?
స్టాలిన్, పళినికి పోటీగా బరిలోకి విజయ్
విజయ్ శ్రీనివాస్
తమిళనాడులో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కే. పళని స్వామి ముందస్తు ప్రచారాలను ప్రారంభించారు.
ఈ కాంబినేషన్ కు ఇప్పుడు నటుడు విజయ్ కూడా తోడైయ్యారు. ఇది రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ విశ్లేషకుడు టీఎన్ రఘు తన మాటల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించారు.
డీఎంకే, ఏఐడీఎంకే రెండూ అసాధారణంగా ముందుగానే ప్రచారాలను ప్రారంభించాయి. దీనికి కారణం ఏంటీ?
ఇది చాలా అసాధారణం. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ముఖ్య కారణం. ఆయన రాజకీయ ప్రవేశం ఎన్నికల్లో పోటీని, ఉత్సాహాన్ని నింపింది. రెండు పార్టీలు కూడా తొలి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఉనికి రాజకీయాల్లో పాల్గొనని వారిలో కూడా ఆసక్తిని రేకెత్తించింది.
ఈ దశలో అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని మీరు ఎలా చూస్తారు?
అన్నాడీఎంకే- బీజేపీ మధ్య నిజమైన కెమిస్ట్రీ లేదు. ఈ కూటమిలోకి తిరిగి రావడానికి పళని స్వామి కారణం చెప్పలేదు. బీజేపీ తమ పార్టీని మింగివేయడానికి చూస్తోందని, ఈ భాగస్వామ్యాన్ని అసహజంగా చూస్తోందని అన్నాడీఎంకే కార్యకర్తలు చూస్తున్నారు. తమిళనాడులో పెద్దగా ఆశల్లేని కాంగ్రెస్ మాదిరిగా కాకుండా, బీజేపీ ఉద్రిక్తతలు సృష్టిస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది.
విజయ్ రాజకీయ ప్రవేశం ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు?
విజయ్ చాలాకాలం నుంచి రాజకీయా ప్రవేశం చేయాలని చూశాడు. ఇదే సరైన సమయం అనుకుని బరిలోకి దిగాడు. ఆయన రాకుండా ఈ ఎన్నికలు ప్రజలు, పార్టీల్లో ఆసక్తిని సృష్టించి ఉండేవి కావు.
ఆయన రాజకీయ ఉనికి రోజువారీ చర్చనీయాంశంగా మార్చింది. సాధారణంగా దూరంగా ఉండే వ్యక్తులను తీసుకువచ్చింది. ముఖ్యంగా అన్నాడీఎంకే బాగా రాణించక అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆయన కచ్చితంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతారు.
ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకే పునర్జీవనంపై ఈపీఎస్ నమ్మకంగా ఉంది. అది ఎంత వరకూ వాస్తవం?
అన్నాడీఎంకే అంత నమ్మకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ప్రణాళిక విజయ్ తో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేయడం అయి ఉండవచ్చు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బీజేపీ కూటమిలోకి తిరిగి రావడం వల్ల ఓటర్లకు కొత్తగా లేదా ఉత్తేజకరంగా లేవు.
విజయ్ తరువాత అన్నాడీఎంకే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా?
విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అలా చేస్తే తన ఆకర్షణ కోల్పోతాడు. తమిళనాడులో కొత్త పార్టీ పట్టు సాధించడానికి సాంప్రదాయకంగా డీఎంకే వ్యతిరేక ఓటును సాధించాల్సి ఉంటుంది.
అధికార పార్టీకి వ్యతిరేకంగా తనను తాను నిలబెట్టుకోవడంలో అతని బలం ఉంది. అన్నాడీఎంకే గత పాలనపై అతని మౌనం.. వారి ఓటు బ్యాంకును ఆకర్షించడానికి అతను ప్రయత్నాన్ని సూచిస్తుంది.
విజయ్ నీ టీవీకే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. 2031 కంటే ముందు 2026 అతనికి ఒక పరీక్ష అనుకుంటున్నారా?
కచ్చితంగా పరీక్షే. 2026 లో ఆయన గెలవకపోతే 2031 నాటికి విశ్వసనీయ శక్తిగా ఎదగడానికి పార్టీని నిర్మించడం, ప్రజా సమస్యల కోసం పోరాటాలపై దృష్టి పెట్టాలి. ఎంజీఆర్ లాగా కాకుండా విజయ్ కు ముందస్తు రాజకీయ అనుభవం లేదు. కాబట్టి ఇది కష్టతరమైన ప్రయాణం అవుతుంది. కానీ ఆయనకు వయస్సు, ఆకర్షణ, ఉద్దేశం ఉన్నాయి.
2026 లో విజయ్ ఒక ఆచరణీయమైన మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించగలరా?
అవకాశం కనిపించడం లేదు. డీఎంకే కూటమి స్థిరంగా ఉంది. పీఎంకే, డీఎంకే కి పరిమిత ఎంపికలు ఉన్నాయి. విజయ్ 2026 పనితీరు ఆధారంగా మూడో ఫ్రంట్ కు బీజం పడవచ్చు. బహుశా 2029 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది జరిగే అవకాశం ఉంది.
విజయ్ ఎవరి ఓటు బ్యాంకును చీల్చే అవకాశం కనిపిస్తుంది?
డీఎంకేకు వ్యతిరేకంగా అధికార వ్యతిరేక ఓట్లను, బీజేపీతో పొత్తుతో అసంతృప్తి చెందిన అన్నాడీఎంకే ఓటర్లను విజయ్ తన ఖాతాలో వేసుకుంటాడు. అన్నాడీఎంకే మద్దతుదారులను ఆకర్షించడం, గత పాలనపై దాడి చేయడం ద్వారా వారిని దూరం చేసుకోకపోవడం అతని వ్యూహంగా కనిపిస్తోంది.
డీఎంకేపై బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? దాని సంక్షేమ పథకాలు పార్టీని కాపాడతాయా?
ప్రతిపక్షంలో డీఎంకే కష్టపడి పనిచేస్తుంది. కానీ ఏఐడీఎంకే తిరిగి అధికారంలోకి రావడానికి డీఎంకేపై ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడింది. జయలలిత వంటి ఆకర్షణీయమైన నాయకురాలు లేకుండా ఏఐఏడీఎంకే సవాళ్లను ఎదుర్కొంటోంది. పళని స్వామి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు. కానీ ఇది చాలడం లేదు. ఇది కఠినమైన పోరాటం.
Next Story