తమిళనాడు: రెండు పార్టీలలో కొనసాగుతున్న వారసత్వ వైరాలు
x

తమిళనాడు: రెండు పార్టీలలో కొనసాగుతున్న వారసత్వ వైరాలు

ఎండీఎంకే, పీఎంకేలో తండ్రులపై కుమారుల పోరు


(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)

తమిళనాడులో ఒకప్పుడు డీఎంకేలో వారసుల మధ్య పోరు నడిచింది. కరుణానిధి తన వారసుడిగా స్టాలిన్ ను ప్రకటించడంతో పెద్ద కొడుకు అళగిరి అలిగి తిరుగుబాటులాంటిది ప్రయత్నించారు.

కానీ సక్సెస్ కాలేకపోయారు. తరువాత స్టాలిన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మరో వారసత్వ పోరు నడుస్తోంది. ఒకటి ఎండీఎంకే పార్టీలో కాగా, మరో పోరు పీఎంకే పార్టీలో.

ఈ రెండు పార్టీలు ప్రస్తుతం అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ఈ పోరును జాగ్రత్తగా పరిశీలిస్తే తమిళ రాజకీయాల్లో కుటుంబ ఆధిపత్యం ఎంత లోతుగా వేళ్లనుకుందో స్పష్టమవుతుంది.

మారుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) పార్టీ అధినేత వైకో .. కుమారుడు ఇప్పుడు పార్టీలో తిరుగుబాటు ప్రకటించారు. తన తండ్రికి దీర్ఘకాలం పాటు విశ్వాసపాత్రుడిగా ఉన్న పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లై సత్యను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామాను సమర్పించాడు.
తిరుచ్చి ఎంపీగా ఉన్న వైకో కుమారుడు దురై వైకో.. ఎండీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శి కూడా. ఇప్పుడు వైకో పైనే నేరుగా తిరుగుబాటు ప్రకటించడంతో పార్టీలో సంక్షోభం తలెత్తింది.
తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా దురై రాసి విడుదల చేసిన లేఖలో కొన్ని భావోద్వేగ ఆరోపణలతో పాటు, ఇంకొన్ని తీవ్రమైన అంశాలు సైతం ఉన్నాయి.
ఇది మల్లై సత్య, దురై వైకో మధ్య ఉన్న ఆధిపత్య పోరును బయటపెట్టింది. సత్య పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. 2021 లో పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎన్నికన తరువాత ఇవి వేగం ఫుంజుకున్నాయని ఆయన లేఖలో ఆరోపించారు.
పార్టీ అంతర్గత వ్యక్తులు ఈ సంఘర్షణను ఆధిపత్య, అహాంకార పోరుగా అభివర్ణిస్తున్నారు. ఇది క్రమంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
వైకో ఒకప్పుడు డీఎంకేలో ఉండేవారు. అక్కడి నాయకత్వంతో పొసగకపోవడంతో ఆయన 1994 లో సొంతంగా ఎండీఎంకే స్థాపించారు. ఆ సమయంలో ఆయన వెన్నంటి ఉన్న నేత మల్లై సత్య మాత్రమే. పార్టీలోని అన్ని కార్యక్రమాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి.
దురై వర్సెస్ సత్య..
పార్టీ కార్యక్రమాలలో ప్రతిదాంట్లో సత్య పాత్ర రావడంతో దురైకు చికాకు కలిగించిందని తెలుస్తోంది. తనకు కార్యకర్తల మద్దతు, తండ్రి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. గతవారం జరిగిన ఎండీఎంకే ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
సత్య తన ప్రాభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. దీనితో సత్య, దురై మధ్య బహిరంగంగా గొడవ జరిగింది. ఇక్కడ కొడుకు కంటే తన విధేయుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వైకో నిర్ణయించుకున్నట్లు, దురై ప్రాముఖ్యతను తగ్గించే ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
ప్రస్తుతం జరిగిన దురై రాజీనామా పరిణామం కూడా వ్యూహాత్మక కుట్రగానే విశ్లేషకులు భావిస్తున్నారు. సత్యను పక్కన పెట్టి తన స్థాయిని పెంచుకోవడానికి పార్టీ జిల్లా నాయకులకు పరోక్షంగా వచ్చిన దిశానిర్దేశం కావచ్చని చెబుతున్నారు.
వైకో సందిగ్థత..
సత్యను బహిష్కరించాలని ఎండీఎంకే తిరుచ్చి విభాగం తీసుకున్న తీర్మానం కొంతమంది కార్యకర్తలలో దురైకి ఉన్న అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. సత్యను తొలగించాలని దురై చాలాకాలం నుంచే డిమాండ్ చేస్తున్నారు.
పార్టీకి సత్య ను క్యాన్సర్ గా అభివర్ణించారు. అయితే సత్య పై అధినేత వైకోకు కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. తన కొడుకు రాజీనామా గురించి వైకో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా దిగ్భాంతికరమైనది. దురై రాజీనామా గురించి నేను టీవీల ద్వారా తెలుసుకున్నాను’’ అని చెప్పారు. ఇది తండ్రికొడుకుల మధ్య ఉన్న దూరాన్ని చెబుతుంది.
ఇక్కడ వింతై మరో ప్రకటన ఏంటంటే.. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ తిరుచ్చి ఎంపీగా పనిచేస్తానని, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని దురై ప్రకటించారు.
పీఎంకేలో అంతర్గత పోరు..
తమిళనాడు రాజకీయ చిత్రంలో మరోపార్టీ ఇలాగే కుటుంబ చికాకులతో సతమతం అవుతోంది. ఇది ఎండీఎంకేతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది.
తమిళనాడులో ప్రభావవంతమైన వన్నియార్ కమ్యూనిటీని సమర్థించడానికి 1989 లో పీఎంకే పార్టీని ఎస్ రామదాసు స్థాపించాడు. ప్రస్తుతం ఆయన కొడుకు రాజ్యసభ సభ్యుడు పార్టీ మాజీ అధ్యక్షుడు అయిన అన్భుమణి రామదాస్ మధ్య వైరం జరుగుతోంది.
పీఎంకేలో వైరం అధికారంలో ఉన్న కూటమిలో ఎక్కువ అధికారం కోరుకుంటున్న కొడుకు అన్బుమణి పై తండ్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో ముందస్తు పొత్తుకు ఏర్పాట్లు చేసుకున్న రామదాస్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తన అనుభవం చాలా కీలకమని ఆయన నమ్ముతున్నారు.
అయితే అన్భుమణి ఆధునిక విధానాలను కోరుకుంటున్నారు. మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రిగా తన ట్రాక్ రికార్డ్, పీఎంకే ప్రభావాన్ని విస్తరించాలనే తన దార్శనికతను తరుచుగా బయటపెట్టుకుంటున్నాడు.
మనవడి ప్రవేశం..
పీఎంకే పార్టీలో మనవడి ప్రవేశం కొత్త రాజకీయా సమీకరణాలు, కొట్లాటలకు దారితీసింది. 2024 డిసెంబర్ లో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో రామదాస్ తన మనవడు ముకుందన్ ను యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ముకుందన్ రామదాస్ పెద్ద కుమార్తె గాంధీమతి కుమారుడు.
అన్బుమణి ఈ చర్యను బహిరంగంగా వ్యతిరేకించాడు. తన మేనల్లుడు ఇటీవల పార్టీలోకి ప్రవేశించిన ముకుందన్ యువజన విభాగానికి ఎలా నాయకత్వం వహిస్తాడని ప్రశ్నించారు. అధ్యక్ష పదవిని తిరిగి తనకే కావాలని రామదాస్ కోరుకోవడంతో అన్భుమణి ప్రసుతానికి వెనక్కి తగ్గాడు.
తండ్రిపై ధిక్కార స్వరం..
‘‘నేను నాయకుడిగా కొనసాగుతాను. నా తండ్రికి గౌరవం తెచ్చే ఏదైనా చేస్తాను’’ అని ఆయన ప్రకటించారు. మే 11 న పార్టీ నిర్వహించే చితిరై నిలవు ఉత్సవాన్ని తాను పర్యవేక్షిస్తానని ప్రకటించారు.
ఈ పోరాటం పీఎంకే కేడర్ ను రెండుగా విభజించింది. కొందరు అన్భుమణి ని సమర్థిస్తూ ఉండగా,ఇంకొందరు రామదాస్ వైపు నిలబడ్డారు. ఈ పార్టీకి 3.8 శాతం ఓట్లు ఉన్నాయి. అలాగే ఐదుగురు శాసనసభ్యలు సైతం ఉన్నారు.
ప్రస్తుతం అన్బుమణి నిర్ణయాలు పొత్తును ప్రమాదంలో పడేస్తాయని, ముఖ్యంగా ఏఐడీఎంకే - బీజేపీ కూటమి బలపడుతుందని రామదాస్ నమ్ముతున్నట్లు పార్టీల వర్గాల భోగట్టా. చితిరై తిరువిళ వంటి కీలక కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని అన్బుమణి పట్టుదల చూపడం కుటుంబంలోని లుకలుకలు బయటపెడుతున్నాయి.
రెండు పార్టీల సమాంతర ప్రయాణాలు..
తమిళనాడు రాజకీయాలను కాస్త పరిశీలనగా చూస్తే తరుచుగా తండ్రి కొడుకుల వివాదాలు కనిపిస్తాయి. తండ్రులు స్థాపించిన పునాదిపై కుమారులు తమ ఐడెంటీని కాపాడుకోవడానికి, నిర్మించుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు.
ఇక్కడ ఎండీఎంకే, పీఎంకే విచిత్రమైన సారూపత్యలు పంచుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య ప్రస్తుతం ఉన్న వైరాలు అహం, విధేయత, నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటాలే.
మొదటిది రెండు కుటుంబ పార్టీలు. తండ్రులు వైకో, రామదాస్ పార్టీలను స్థాపించి నడిపిస్తుండగా, వారి కుమారులు వైకో, అన్భుమణి రామదాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెండో అంశంలో.. రెండు పార్టీలలో కొడుకును కాదని, ఇతర వ్యక్తులకు ప్రాధాన్యం దక్కుతోంది. దీనిపై ఇరువురు ఆగ్రహంగా ఉన్నారు.
మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే.. రెండు పార్టీలు తమ కుమారులకు పార్లమెంటరీ పదవులను నియమించుకున్నాయి. తిరుచ్చి ఎంపీగా దురై, రాజ్యసభ ఎంపీగా అన్బుమణి ఉన్నారు.
నాల్గవది అత్యంత వ్యంగ్యంగా ఉంటుంది.. కానీ చెప్పక తప్పదు.. మొదట్లో రామదాస్, వైకో కూడా తమ కుటుంబాలను పార్టీకి దూరంగా ఉంచుతామని ప్రకటించారు. వారి కుమారులు పార్టీ పదవులు చేపట్టరని హమీ ఇచ్చారు. వ్యక్తిగత ఆశయాలు, కుటుంబ విధేయతలు ఢీకొనడంతో రెండు ప్రజల దృష్టిలో పలుచన అయ్యాయి.
తమిళనాడులో రాజకీయా పోటీ మొత్తం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందనేది వాస్తవం. వాటితో పోలిస్తే ఎండీఎంకే, పీఎంకే చిన్న పార్టీలే అయినప్పటికీ అవి చురుకుగా ఉంటాయి.
మీడియా కవరేజ్, క్యాడర్ ఊహగానాలు, వారి ప్రస్తుత వైరాలు, తమ తండ్రుల ప్రేమ, అధికారం విశ్వాసం ఇతర వ్యక్తుల వైపు మొగ్గు చూపినప్పుడూ కొడుకులు అనుభవించే అభద్రతా భావాన్ని హైలైట్ చేశాయి.
ఏప్రిల్ 20న జరిగే ఎండీఎంకే కార్యవర్గ సమావేశం ఒక నిర్ణయాత్మక క్షణం. తన కుమారుడా లేక విశ్వాస పాత్రుడి మధ్య నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తింది. సత్య పాత్రను పునర్మిచించడం పార్టీ ఐక్యతను కాపాడుతుంది. కానీ దురై బహిరంగ వైఖరి అతను స్పష్టమైన విజయాన్ని కోరుకుంటున్నాడని సూచిస్తుంది.
ఈ వైరాన్ని పరిష్కరించడంలో విఫలమైతే ఎండీఎంకే క్యాడర్ విచ్చిన్నమవుతుంది. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో దాని పరపతి బలహీనపడుతుంది. అదే విధంగా మే 11న జరిగే పీఎంకే చితిరై తిరువిళ పార్టీకి అగ్నిపరీక్ష అవుతుంది.
ఈసీ మద్దతుతో ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించాలని అన్భుమణి పట్టుబట్టడం, ఆయన తండ్రి అధికారానికి వ్యతిరేకంగా నేరుగా నిలబెడుతుంది. రామదాస్ మద్దతుదారులు ఆయన అనుభవం పొత్తు చర్చలకు చాలా ముఖ్యమైనదని వాదిస్తున్నారు.
ఇక్కడ ఆయనకు యువత అనుకూలంగా ఉన్నారు. ఇది ఎన్డీఏలో పీఎంకే స్థానాన్ని బలోపేతం చేయగలదు. కానీ ఆయనను ధిక్కరించడం వల్ల పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉంది.


Read More
Next Story