ఆదానీ గ్రూపుతో వ్యాపార సంబంధాలను రద్దు చేసుకున్న తమిళనాడు
x

ఆదానీ గ్రూపుతో వ్యాపార సంబంధాలను రద్దు చేసుకున్న తమిళనాడు

తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసినప్పటికీ టెండర్ రద్దు చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ


ప్రముఖ వ్యాపారవేత్త ఆదానీ గ్రూపుతో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన కొన్ని వారాల తరువాత తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ టాన్ జెడ్ కో( TANGEDCO) ఆ గ్రూపుతో కుదుర్చుకున్న టెండర్లను రద్దు చేసింది.

సంస్థ పిలిచిన విద్యుత్ టెండర్లలో తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసినప్పటికీ వాటిని సంస్థ రద్దు చేసింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్(AESL) తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్లాన్ చేసిన స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఇన్ స్టాలేషన్ కోసం నాలుగు ప్యాకేజీలకు కు టెండర్లను ఆహ్వనించింది.

దీనిలో ఒక దానికి అత్యల్ప బిడ్ ను ఆదానీ గ్రూపు దాఖలు చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా చెన్నై, తిరువళ్లూర్, చెంగల్ పట్టు సహ ఎనిమిది జిల్లాలో 82 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే బిడ్ లో కూడా ధర చాలా ఎక్కువగా ఉందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ భావించింది. ధర తగ్గించేందుకు కంపెనీతో చర్చలు జరిపామని అయితే చర్చలు సఫలం కాలేదని అందుకే టెండర్ ను రద్దు చేసినట్లు సమాచారం. ఇలా అన్ని టెండర్లను సంస్థ రద్దు చేసింది.
కేంద్రం ఇచ్చి రూ. 19 వేల కోట్ల రివాంర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద మూడు కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయించారు. వీటికి కావాల్సిన అన్ని టెండర్లను ఆగష్టు 2023 లోనే ఖరారు అయ్యాయి. కానీ వాటిని సంస్థ రద్దు చేసింది.
డీఎంకే.. ఆదానీ మధ్య దూరం..
ఆదానీ గ్రూపు దేశంలో ఎనర్జీ ప్రాజెక్ట్ లను దక్కించుకోవడానికి లంచాలు ఇచ్చిందని అమెరికా కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. దీనితో తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. టెండర్లు రద్దు కాగానే మంత్రి వి. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ.. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని అన్నారు.
సౌర విద్యుత్ ను కొనుగోలు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇంతకుముందు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా తను ఆదానీని ఎప్పుడూ కలవలేదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.
అంతకుముందు ఆదానీ గ్రూపు పై కేసు నమోదు అయింది. టాన్ జెడ్ కో కు 2013 నుంచి 2016 వరకూ సరఫరా చేసిన బొగ్గు నాసిరకంగా ఉండటంతో సంస్థకు రూ. 3 వేల కోట్ల నష్టం వచ్చిందని ఓ స్వచ్చంద సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ కు చెందిన జయరామ్ వేంకటేశన్ ఫిర్యాదు చేశారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ సంస్థ దర్యాప్తు చేస్తోంది.


Read More
Next Story