కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌‌ను మార్చబోతున్నారా?
x

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌‌ను మార్చబోతున్నారా?

ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా ఈ పదవిలో ఉన్నారు.


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కూడా చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయాలపై పార్టీ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్పారు.

ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా ఈ పదవిలో ఉన్నారు.

“రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఆ మీటింగ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వెళ్తున్నారని తెలిసింది. సమావేశం తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్‌ చర్చించే అవకాశం ఉంది. కేపీసీసీ అధ్యక్షుడి ఎంపిక హైకమాండ్‌కే వదిలేశాం. ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.’’ అని పరమేశ్వర చెప్పారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తన పోర్ట్‌ఫోలియో మారుతుందా? అని అడిగిన ప్రశ్నకు అది హైకమాండ్ నిర్ణయిస్తుందని బదులిచ్చారు. "ఇప్పటి వరకు, నేను హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాను. గత 35 సంవత్సరాలుగా వారు నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించాను. కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను." అని పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడం అంత తేలికైన పని కాదని కెపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరిగా భావిస్తున్న పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కిహోళి అన్నారు. అది చాలా బాధ్యతతో కూడుకున్నదని చెప్పారు.

Read More
Next Story