త్రిసూర్ ఎంపీ సురేష్ గోపీపై అంబులెన్స్ దుర్వినియోగం కేసు
x

త్రిసూర్ ఎంపీ సురేష్ గోపీపై అంబులెన్స్ దుర్వినియోగం కేసు

కేరళ రాష్ట్రం త్రిసూర్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ గోపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


కేరళ రాష్ట్రం త్రిసూర్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ గోపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్‌, అంబులెన్స్ డ్రైవర్‌పై కూడా త్రిసూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి పూరం వేదిక వద్దకు వెళ్లేందుకు అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసిన గోపిపై చట్టపర చర్యలు తీసుకోవాలని స్థానిక సీపీఐ నాయకుడు కేపీ సుమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ గోపిపై ఐపీసీ సెక్షన్‌లు 279 (అవగాహన డ్రైవింగ్ లేదా బహిరంగ మార్గంలో రైడింగ్) 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో పలువురు వ్యక్తులు చేసిన చర్యలు), మోటారు వాహనాల చట్టంలోని 179, 184, 188,192 సెక్షన్ష కింద కేసు కట్టారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో అప్పటి బీజేపీ అభ్యర్థి గోపి, మరికొంతమంది ఎన్నికల ప్రచారానికి సేవాభారతి అంబులెన్స్‌ను వినియోగించడంతో పాటు ప్రాణాలకు హాని కలిగించేలా దాన్ని నడిపారని ఫిర్యాదులో పొందుపర్చారు.

అయితే తాను అంబులెన్స్‌లో ఉత్సవ వేదిక వద్దకు వచ్చానన్న ఆరోపణలను సురేష్ గోపీ ఖండించారు. నేను నా కారులో ఉత్సవం జరిగే ప్రదేశానికి చేరుకున్నాను. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన కొందరు గూండాలు కారుపై దాడి చేశారని ఆరోపించారు. కొందరు యువకులు నన్ను అక్కడి నుంచి రక్షించి ఉత్సవ స్థలంలో ఉన్న అంబులెన్స్‌లో తనను బయటకు తీసుకెళ్లారని సురేష్ గోపి చెప్పారు.

Read More
Next Story