కర్నాటక బీచ్ లో భూతం.. విజిటర్లకు ఎలెర్ట్
x

కర్నాటక బీచ్ లో భూతం.. విజిటర్లకు ఎలెర్ట్

దక్షిణ కర్నాటలోని ఉల్లాల్ బీచ్ లో దెయ్యం తిరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని..


దక్షిణ కన్నడలోని ఉల్లాలా బీచ్ నుంచి సముద్రంలో వెళ్లరాదని హెచ్చరిస్తూ వేసిన ఓ ఫ్లెక్సీ కర్నాటకలో వైరల్ గా మారింది. బీచ్ లో సరదాగా గడపడానికి వస్తున్న పర్యాటకులు ఈ మధ్యన సముద్రంలో మునిగి చనిపోతున్నారు. దీనికి కారణం అక్కడ సైతాన్ తిరుగుతోందని కొంతమంది స్థానికలు బలంగా నమ్ముతున్నారు.

ముస్లింల ఆధ్యాత్మిక కేంద్రం ఉల్లాల్ మదానీ దర్గాకు రంజాన్ పండగ ముగిసిన తరువాత భక్తులు తరలివస్తారు. అయితే కుటుంబాలతో వచ్చే కొందరు ఇక్కడ బీచ్ లో సేదతీరుతూ ఉంటారు. చీకటి పడ్డాకా కూడా ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడరు. చీకట్లో సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నించి చాలామంది ఇక్కడ ఇంతకుముందు మృత్యువాత పడ్డారు. దీనిని అడ్డుకునేందుకు కొంతమంది స్థానికులు ప్లెక్సీ లు పెట్టి ఇక్కడ సైతాన్ తిరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఇందులో వాడిన ఓ ఫొటో అందరికి చెమటలు పట్టిస్తోంది. ట్రాన్స్ పరెంట్ గా ఉన్న ఓ ఆకారం అందులో స్ఫష్టంగా కనిపిస్తోంది.

మగ్రిబ్ కు ముందే (సూర్యాస్తమయాన్ని ముస్లింలు మగ్రిబ్ అంటారు) ఇక్కడ నుంచి వెళ్లిపోండి. సైతాన్ కుతంత్రం కారణంగా చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. అలాగే కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారని ప్లెక్సీలో హెచ్చరించారు. సముద్రాన్ని చూడడం ముస్లింలు పూజగానే భావిస్తారు. కావునా నీళ్లలో దిగకుండా కేవలం కళ్లతోనే పూజలు చేసి చీకటి పడకముందే ఉల్లాల బీచ్ ను వదిలివేయాలని మనవి చేశారు.

వైరల్ గా మారిన ప్లెక్సీ..
బీచ్ లో తీసిన ఫొటోలో ఓ మహిళ అస్పష్టమైన రూపం కనిపిస్తోంది. దీంతో ఇక్కడ దెయ్యం ఉందనే పుకార్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో వందలాది మంది దీనిని షేర్ చేయడంతో ఈవార్త దావానంలా వ్యాపిస్తోంది.
దీనిపై ఓ ఫొటో గ్రాఫర్ ఫెడరల్ తో మాట్లాడుతూ.. కెమెరా లెన్స్ కారణంగా కదిలే వస్తువులు కొన్నిసార్లు అస్పష్టంగా కనిపిస్తాయి. ఇది కూడా అలాంటి చిత్రమే కావచ్చు. లేదా ప్రజలను భయపెట్టడానికి లేదా హెచ్చరించడానికి కొంతమంది ఎడిట్ చేసిన ఫొటో అయినా కాచ్చని ఆయన చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ లో ఇక్కడ విహరానికి వచ్చిన చిక్కమంగళూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సముద్ర స్నానం కోసం దిగి మరణించారు. ఈ సారి స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు రావడం, అలాగే పండగలు కూడా కలిసి రావడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది.
ఇలా ఎవరైన సముద్రంలోకి దిగకుండా జాగ్రత్త తీసుకునేందుకు ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. మాకు ఇప్పటి వరకూ ఎలాంటి దుస్సంఘటన తాలూకూ భయాలులేవని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ స్థానికులు ఫెడరల్ కు చెప్పారు.
Read More
Next Story