పీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు..
x

పీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు..

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తన కొడుకు అన్బుమణి తొలగించి ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేశారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ రామదాస్.


పట్టాలి మక్కల్ కట్చి (PMK) నాయకత్వ విషయంలో గత కొంతకాలంగా తండ్రీకొడుకులు ఎస్ రామదాసు(S Ramadoss), అన్బుమణి(Anbumani) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ రామదాస్ ..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తన కుమారుడు అన్బుమణిని ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించి, కమిటీని రద్దు చేయడం తాజా పరిణామం. తిండివనంలో ఇటీవల జరిగిన కార్యనిర్వాహక కమిటీలో అన్బుమణి, ఇతర సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు.

పార్టీని తానే స్వయంగా నడిపించాలని నిర్ణయించుకున్న రామదాస్ ఏప్రిల్‌లో తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించడంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గత నెలలో రామదాస్ తన కొడుకుపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అన్బుమణి ద్రోహిగా అభివర్ణిస్తూ.. పార్టీని తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్బుమణితో రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయని విలేకరులతో కూడా చెప్పారు రామదాసు.

Read More
Next Story