
తమిళనాడు ఎన్నికలు 2026: పీఎంకే కీలక నిర్ణయం
పార్టీ ప్రెసిడెంట్‌గా రామదాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్బుమణి
తమిళనాడులో పొలిటికల్ హీట్ వెడెక్కుతోంది. 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలకు నేతలు పదును పెడుతున్నారు. పొత్తులతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలని ఎత్తులు వేస్తున్నారు.
ఇటు పట్టాలి మక్కల్ కట్చి (PMK) కూడా ఎన్నికల పోరుకు సమాయత్తమవుతోంది. కీలక భూమిక పోషించేందుకు సిద్ధమమవుతోంది. తాను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ (S Ramadoss) పార్టీ ప్రకటించారు. తన కుమారుడు అన్బుమణి రామదాస్(Anbumani Ramadoss ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తైలపురంలో మీడియాకు చెప్పారు. తనకు పదవులపై మక్కువ లేదని చెప్పుకొస్తూనే..పార్టీని బలోపేతం చేయడం, యువతరానికి మార్గనిర్దేశం చేయడం, తర్వాతి తరానికి నాయకత్వం వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ రామదాస్ చెప్పారు.
AIADMKతో బీజేపీ పొత్తు..
మరోవైపు తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే AIADMKతో పొత్తుపెట్టుకుంది. ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఇ, ఫళని స్వామి కొన్ని రోజుల క్రితం కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. AIADMK నేతలపై గతంలో అన్నామలై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఆ కారణంగా ఆయనను తప్పించాలని షాను ఫళనీ స్వామి కోరినట్లు సమాచారం.
ఇటు డీఎంకే, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన TVK (Tamilaga Vettri Kazhagam) పార్టీ కూడా దూకుడు పెంచుతోంది. ఆ పార్టీ చీఫ్, సినీనటుడు విజయ్ ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.