కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం
x
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు

కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం

తమిళనాడు తరహాలోనే బహిరంగ కార్యకలాపాలపై పరిమితులు


తమిళనాడు తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) కార్యకలాపాలపై నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) చెప్పారు. అయితే ఇవి కేవలం బహిరంగ ప్రదేశాలలో నిషేధం వరకే పరిమితం అని ఆయన వివరణ ఇచ్చారు.

కర్ణాటక గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు ఈ విషయంపై లేఖ రాసిన తరువాత ఇది చర్చలలోకి వచ్చింది. ప్రభుత్వ స్థలాలలో ఆర్ఎస్ఎస్ శాఖల ఏర్పాటు, సమావేశాల నిర్వహణపై నిషేధం విధించాలని ఖర్గే లేఖలో కోరారు.
తమిళనాడు తరహలోనే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించే చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా భద్రత, మతపరమైన కారణాలతో బహిరంగంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరగకూడదని నిషేధం విధించింది.
విభజన శక్తులను అరికట్టాలి
తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు, పబ్లిక్ సమావేశాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై ఆ సంస్థ న్యాయపోరాటానికి దిగింది. కొన్ని పరిమితుల దృష్ట్యా ఆర్ఎస్ఎస్ నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నారు.
కాంగ్రెస్ రాజ్యాంగ విలువలకు, సెక్యూలర్ విలువలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆర్ఎస్ఎస్ సమాజాలలో ద్వేషాన్ని నాటుతోందని ప్రియాంక్ ఖర్గే వాదించారు. దేశ ఐక్యత, సమగ్రతకు విరుద్ధంగా ముఖ్యంగా విద్యా, ప్రభుత్వ సంస్థలలో ప్రతికూల ఆలోచనలను ఆర్ఎస్ఎస్ ప్రొత్సహిస్తుందని ఆరోపించబడిన దాని గురించి ఆ లేఖలో ఆందోళనలు ఉన్నాయి. మత సామరస్యాన్ని, ప్రజా శాంతిని కాపాడుకునే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఈ సిఫార్సులపై చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు.



Read More
Next Story