అమిత్ షా ను పిచ్చికుక్క కరిచింది: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్
x

అమిత్ షా ను పిచ్చికుక్క కరిచింది: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్

అంబేడ్కర్ ను అవమానించారనే మాటలపై కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసన


బీఆర్ అంబేడ్కర్ పై అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. అమిత్ షాకు ‘పిచ్చి కుక్క’ కరిచిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బెంగళూర్ లో విలేకరులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బయోటెక్నాలజీ మంత్రి మాట్లాడుతూ, “ఏడు జన్మలలో భగవంతుని నామాన్ని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో అంబేద్కర్ నామాన్ని జపించడం ద్వారా మనం రాజకీయ,సామాజిక, ఆర్థిక సమానత్వం పొందుతాము." అన్నారు.
అంబేద్కర్, సమానత్వం తన( హోంమంత్రి) ఆలోచనల్లో లేకపోవడమే తన సమస్య అని ఖర్గే కేంద్ర హోంమంత్రిని ఉద్దేశించి అన్నారు. అంబేద్కర్‌, బసవ తత్వాలు ఎంతగా పెరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం అంతలా తగ్గిపోతుంది. "అతన్ని పిచ్చి కుక్క కరిచింది," అని షాను దూషిస్తూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా అమిత్ షా తన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందని, నెహ్రూ తనను ఎన్నికల్లో ఎలా ఓడించారు, మంత్రివర్గంలో ఎలా అవమానించారో అంబేడ్కర్ విషయాలను బీజేపీ తాజాగా బయటకు తీసి ప్రచారం మొదలు పెట్టింది. అలాగే తన పాత వీడియోలను కూడా ఎడిట్ చేసి ఒకే వీడియోగా మార్పు చేసి ఎక్స్ లో పోస్టు చేశారని కేంద్ర హోంమంత్రి షా ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడని విషయాలను ఎడిట్ చేసి తెలంగాణ పీసీసీ ఎక్స్ లో పోస్టు చేసింది. ఈ విషయం పై బీజేపీ ఢిల్లీలో కేసు పెట్టింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కూడా ఎడిట్ చేసిన వీడియోల విషయంలో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.



Read More
Next Story