కర్సివ్ బుక్ ప్రాక్టీస్ చేస్తూ.. సివిల్స్ విజేతగా నిలిచిన..
రోడ్డు ప్రమాదం తరువాత కుడిచేయి హ్యాండ్ రైటింగ్ రాయడానికి సహకరించలేదు. ఎల్ కే జీ పిల్లలు రాసే కర్సివ్ బుక్ లో ఎడమ చేతితో తిరిగి పోరాటం ప్రారంభించింది. కట్ చేస్తే
ఉట్టి ఉట్టిగనే విజేతలయిపోరు.. ఎన్ని కష్టాలు ఎదురైన తట్టుకుని నిలబడి పోరాడితే విజయం మనల్ని వరిస్తుందనే దానికి కేరళ చెందిన పార్వతి గోపకుమార్ మనకో ఓ ఉదాహారణ. తాజాగా ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 282 వ ర్యాంక్ సాధించింది ఈ న్యాయశాస్త్ర విద్యార్థిని. కానీ పార్వతి కుడి చేయి తో రాయలేదు.
పార్వతి గోపకుమారి ఏడో తరగతి చదివే రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుడిచేయి తెగింది. ప్రమాదంలో కోలుకున్న తరువాత రాయడం కష్టంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిల్లో ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేసింది. దీనికి కర్సివ్ బుక్ లను ప్రాక్టీస్ చేసింది. ఎల్ కే జీ పిల్లల పుస్తకాలు కొని వాటితో నిత్యం సాధన చేసేది. ఎడమ చేతితో రాయడంలో నిఫుణుల చేత ప్రాక్టీస్ చేయించాలని ఇంట్లో కోరినా తాను వద్దంది. ఈ వైకల్యాన్ని ఎలాగైనా జయించాలని పట్టుదలతో పోరాటం చేసింది.
కేరళలోని ప్రభుత్వ బడుల్లోనే పార్వతి చదువు కొనసాగింది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ కక్కజామ్ గ్రామంలో సెకండరీ విద్యను అంబలపూజమ్ లో పూర్తి చేసింది. ఎనిమిదో తరగతిలో ఉండగానే తల్లి శ్రీకళ బిడ్డ పట్టుదలను గుర్తించింది. విధి తన కోసం ఏదో గట్టి లక్ష్యాన్ని సెట్ చేసి ఉంచిదని అందుకే దీక్షగా అనుకున్న పని పూర్తి చేస్తోందని గ్రహించింది. సివిల్స్ ఫలితాల్లో బిడ్డకు ర్యాంకు రావడంతో ఇది నిజమని తేలింది.
ప్లస్ టూ లో తను హ్యూమానిటిస్ అనే కోర్సును ఎంచుకుంది. దీంతో ఇంట్లో వాళ్లు కంగారుపడ్డా తనే సర్దిచెప్పింది. అది పూర్తవ్వగానే బెంగళూర్ లో లా చదివింది. అది పూర్తవ్వగానే తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఐఏఎస్ ఇనిస్టిట్యూట్ లో చేరింది. అలా తన రెండో ప్రయత్నంలో అలిండియా ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకుంది.
" ఐఏఎస్ కావాలనుకున్న నా కల సాకారం అయినందుకు నాకు సంతోషంగా ఉంది. నాకు శిక్షణ ఇచ్చి సివిల్ సర్వీసెస్ లో విజయం దిశగా నడిపించిన నాగురువు మునిదర్శన్ కు కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా ప్రియ మిత్రుడు సచిన్ కూడా నా విజయంలో ఉన్నారు " అని పార్వతి చెప్పింది.
విధి నన్ను కిందికి లాగాలని చూసినప్పుడు నేను ధైర్యంగా పోరాడాను. నాకు జీవితంలో కచ్చితమైన ఆశయం అంటూ ఏమిలేదు. ఏది నాముందుకు వచ్చిన అందరి మన్ననలు పొందేలా పనిచేయాలన్నదే నా లక్ష్యం. " సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించడమే ఇప్పటిదాకా లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏదీ వచ్చినా చేస్తాను. జీవితంలో ఉన్నతంగా ఉండేందుకు కృషి చేస్తా.. అదే నా ప్రణాళిక" అని పార్వతి చెప్పింది.
పార్వతి తండ్రి గోప కుమార్ రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్. తల్లి శ్రీకళ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు.
Next Story