వరదల పై బెంగళూర్ ప్రజల ఆగ్రహం, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసంతృప్తి
x

వరదల పై బెంగళూర్ ప్రజల ఆగ్రహం, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసంతృప్తి

బెంగళూర్ ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారని, అయితే మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని..


భారత సిలికాన్ సిటీ బెంగళూర్ నగరాన్ని సోమవారం కుండపోత వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలను వరదలో మునిగిపోయాయి. సాధారణ జీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాల సమయంలో రోడ్లు, డ్రెయిన్లు పనిచేసేలా చూడడంలో ప్రభుత్వం విఫలమైందని, అయితే ప్రభుత్వం తమపై ఎందుకు ఎక్కువ పన్నులు వేస్తోందని చాలా మంది సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. పాఠశాలలను మూసివేయాలని సోమవారం ఉదయం 8 గంటలకు బెంగళూరు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది.

ఇంటి లోపలే ఉండండి- బీఎంపీ
భారీ వరదల తరువాత, నగర మునిసిపాలిటీ అయిన బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) ఓ ప్రకటన చేసింది. ప్రజలు "ఇంటి లోపలే ఉండండి. కిటికీలు, తలుపులు మూసివేయండి. వీలైతే ప్రయాణాన్ని ఆ రోజుకు ఆపేయండి" అని ప్రజలను కోరింది.
డాక్టర్ రజత్ ఆత్రేయ, నియోనాటాలజిస్ట్, నిత్యం రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ లేదా ORR నుంచి వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. " ఓఆర్ఆర్ సాధారణంగా ముంపులో ఉండకూడదు. కానీ ఇప్పుడు ఇది కూడా ముప్పు గా ఏర్పడబోతోంది. ఎవరైనా రోడ్లపైకి వెళ్లాల్సిన అవసరం లేదు, దయచేసి ఎవరూ బయటకు రావద్దు” అని ఆయన హెచ్చరించారు.
పన్నులు ఎక్కువ, ఇన్‌ఫ్రా తక్కువ..
నగరానికి చెందిన ఓ స్థానికుడు కూడా రింగ్ రోడ్ వీడియోలను పోస్ట్ చేసారు. ప్రమాదకర పరిస్థితులకు అత్యధిక పన్నులు చెల్లించే నగరం మనది. మన నగరంలో మౌలిక సదుపాయాలు ఇలా ఉన్నాయని కామెంట్ చేశాడు. ఈస్ట్ బెంగళూరులోని సిటిజన్స్ మూవ్‌మెంట్ అధికారిక హ్యాండిల్ కూడా ఇదే విధమైన ప్రశ్న లేవనెత్తింది. పౌరులకు తక్కువ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది.
పాఠశాలలు మూసివేత..
వర్షాల వల్ల పాఠశాలలు ఉదయం 8 గంటల తరువాత మూసివేస్తున్నామని ప్రకటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పాఠశాలలకు వెళ్తూ దారి మధ్యలో ఉన్న సమయంలో సెలవు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎక్స్ వినియోగదారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్‌ను ఇలా అడిగారు. "కనీసం ఉదయం 6.30 గంటలలోపు ముందస్తుగా ఎందుకు సెలవు ప్రకటించకూడదు?" అని ప్రశ్నించారు. మరొక ఎక్స్ వినియోగదారు తన ఇంటి నుంచి బయటకు వెళ్లడం అసాధ్యం అయితే, అతని సంస్థ తనను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించలేదని ఫిర్యాదు చేస్తూ బెల్లందూర్ సమీపంలోని వీడియోలను పోస్ట్ చేశాడు.
ఎల్లో అలర్ట్ జారీ..
మరోవైపు భారత వాతావరణ శాఖ సోమవారం బెంగళూరు అర్బన్, రూరల్ రెండింటికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో వర్షాలపై నిఘా ఉంచే వాతావరణ శాస్త్రవేత్త ప్రదీప్, అక్టోబర్‌లో ఇటువంటి ఉదయం వర్షాలు, పిడుగులు చాలా అరుదని అన్నారు. ‘‘పశ్చిమ బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 60మి.మీ వర్షం పడింది. అయితే, అది కాస్త బలహీనపడినట్లు కనిపిస్తోంది’’ అని తన ఎక్స్ పేజీ బెంగళూరు రెయిన్ అలర్ట్‌లో పోస్ట్ చేశాడు.
వర్షాలు..
ముఖ్యంగా పాత మద్రాస్‌ రోడ్డు దగ్గర పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామ్‌లు ఎదురయ్యాయి. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్ కీర్తిగా మురుగేశన్ తన ఎక్స్ ఖాతాలో మాట్లాడుతూ దక్షిణ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

వేసవికాలంలో..

ఈ ఏడాది వేసవికాలంలో బెంగళూర్ నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. బకెట్ నీళ్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడి వలన అనేక కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం ని అమలు చేసింది. కనీసం టాయిలెట్ లలో నీరు లేకపోవడంతో అనేక పాఠశాలలు కూడా మూసేశారు. ఇప్పుడు వర్షాకాలంలో పరిస్థితి పూర్తిగా ఎదురుతిరిగింది.

Read More
Next Story