చెన్నైలో టీచర్స్ అసోసియేషన్ నాయకుల గృహ నిర్బంధం
x

చెన్నైలో టీచర్స్ అసోసియేషన్ నాయకుల గృహ నిర్బంధం

2021 ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు..


Click the Play button to hear this message in audio format

నిరసనలో పాల్గొన్నందుకు అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi K Palaniswami) డిమాండ్ చేశారు. 2021లో ఎన్నికల హామీ - ఇంటర్మీడియట్ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనాన్ని డీఎంకే ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. వారి నిరసన సోమవారానికి 17వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించే వరకు ఆందోళన విరమించమని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.


‘ప్రభుత్వమే బాధ్యత వహించాలి..’

‘‘స్టాలిన్ ప్రభుత్వం నిన్న ఉదయం 8 గంటల నుంచి సెకండరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహకులు రాబర్ట్, అధ్యక్షుడు రెక్స్ ఆనందకుమార్, కన్నన్ సహా 8 మందిని గృహ నిర్బంధంలో ఉంచింది. వారి మొబైల్ ఫోన్‌లను లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు. ఇది వారి ప్రాథమిక హక్కులకు హరించడంతో సమానం. అరెస్టు చేసిన ఉపాధ్యాయులకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. " అని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్‌ చేశారు.

2009 జూన్ 1 తర్వాత నియమకమైన ఉపాధ్యాయులకు, ఆ తేదీకి ఒక రోజు ముందు వరకు నియమితులైన ఉపాధ్యాయులకు మధ్య ప్రాథమిక వేతన వ్యత్యాసాలను సరిచేయడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయులు డిసెంబర్ 26 నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వేతనంలో ప్రారంభంలో రూ. 3,170 ఉన్న వ్యత్యాసం సంవత్సరాలుగా దాదాపు రూ. 9,000 కు పెరిగిందని వారు చెబుతున్నారు.

Read More
Next Story