
పద్మనాభుడికి మహా కుంభాభిషేకం
ఇటీవల ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి..
వందల చరిత్ర ఉన్న కేరళ(Kerala)లోని పద్మనాభుడి పురాతన ఆలయం (Padmanabhaswamy Temple)లో చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జూన్ 8న మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ బి శ్రీకుమార్ తెలిపారు.
"2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం ఆదేశాల మేరకు పునరుద్ధరణ పనులు జరిగాయి. ఆ తర్వాత పనులు ప్రారంభమైనప్పటికీ, కోవిడ్ పరిస్థితి కారణంగా అది పెద్దగా ముందుకు సాగలేదు" అని బి శ్రీకుమార్ పిటిఐకి తెలిపారు. తరువాత, 2021 నుండి దశలవారీగా వివిధ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు.
కొత్తగా నిర్మించిన 'తాళికాకుడమ్స్' (గర్భగుడి పైన మూడు, ఒట్టక్కల్ మండపం పైన ఒకటి), తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయంలో 'అష్టబంధ కలశం' విశ్వక్సేన విగ్రహా పున: ప్రతిష్ట ఉంటాయని పేర్కొన్నారు.
ఆలయ యాజమాన్యం శతాబ్దాల నాటి సంప్రదాయాలకు కట్టుబడి, పవిత్ర ఆచారాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
శ్రీ పద్మనాభస్వామి ఆలయంతో విష్ణువు సర్ప దేవుడు 'అనంత' పై శయనించిన భంగిమలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం చుట్టూ నగరం పెరిగింది.