
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితమేనా?
స్థాయికి మించి పర్-అండ్‌పాలీ ఫ్లోరోఆల్కైల్ సబ్స్టెన్సెస్ (PFAS) ఉన్నట్లు నిర్ధారణ..
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వినియోగం నేడు విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో, కార్యాలయాల్లో, ఇంట్లో కూడా చాలా మంది ఈ నీళ్లనే తాగుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు(Tamil Nadu)లో పలు ప్రాంతాల నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్(Packaged drinking)పై ఐఐటీ మద్రాస్ టీం పరిశోధన జరిపింది. వారి పరిశీలనలో సరిగా శుద్ధిచేయని నీటిని విక్రయిస్తున్నారని గుర్తించారు. ప్యాకేజ్‌డ్ వాటర్‌లో పర్-అండ్‌పాలీ ఫ్లోరోఆల్కైల్ సబ్స్టెన్సెస్ (PFAS) అని పిలిచే “ఫారెవర్ కెమికల్స్” ఉన్నట్లు తేలింది. ఈ రసాయనాలు 23 నుంచి 136 నానోగ్రామ్/లీటర్ ఉండటం అంతర్జాతీయ సిఫార్సు పరిమితుల (0.004-0.02 నానోగ్రామ్/లీటర్) కంటే చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. PFAS అధిక స్థాయిలో ఉండడం వల్ల లివర్, మూత్రపిండ సమస్యలు, కేన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయదారులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

