కేరళ: సీపీఎం కు చెలక్కర, కాంగ్రెస్ కు పాలక్కాడ్ విషమ పరీక్ష
x

కేరళ: సీపీఎం కు చెలక్కర, కాంగ్రెస్ కు పాలక్కాడ్ విషమ పరీక్ష

ఈ రెండు స్థానాల్లో ఎవరు ఓడినా ఆ పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే సీపీఎం కు చెలక్కెర ఓ పెట్టని కోట. కాంగ్రెస్ కు పాలక్కాడ్ 2011 నుంచి అండగా ఉంది.. కానీ


కేరళలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మాజీ మంత్రి కే రాధా కృష్ణన్ తన చివరి ఉత్తర్వూల్లో ఓ చారిత్రాత్మక ఆదేశం జారీ చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా నివసించే ప్రదేశాలను ‘‘కాలనీలు’’ అని పిలవద్దు అని పేర్కొన్నారు. రాధా కృష్ణ ప్రస్తుతం చెలక్కర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఈ తుఫాన్ లో రాధాకృష్ణన్ మాత్రమే కమ్యూనిస్టుల తరఫున ఎంపీగా గెలిచారు. మరో సీట్ ను బీజేపీ గెలుచుకుంది.

రాధాకృష్ణన్, తన విధుల పట్ల అంకిత ప్రభావంతో ఉంటారనే పేరుంది. చాలామంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ఇచ్చిన హమీలను తూచా తప్పకుండా చేసిన నాయకుడు. కేరళ మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఉండటానికి నిజంగా అర్హుడు.
యుద్ధభూమి చెలక్కర
రాధా కృష్ణన్ స్థానంలో ప్రస్తుత మంత్రిగా తొలి ఆదివాసీ కమ్యూనిస్టు నాయకుడు ఓఆర్ కేలు మంత్రిగా పినరయ్ విజయన్ తన కేబినేట్ లోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నిక కావడంతో ఆయన విడిచిపెట్టిన చెలక్కర అసెంబ్లీ నియోజవర్గం నుంచి కొత్త నాయకుడిని ఎన్నుకోవడం సీపీఎంకి చాలా కష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. నిజంగా ఇది సవాల్ తో కూడుకున్నదని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ స్థానం వయనాడ్ ఎంపీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. వీటితో పాటు కేరళ అసెంబ్లీకి మరో స్థానంలో ఉప ఎన్నిక జరగబోతుంది. పాలక్కాడ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ కూడా లోక్ సభ కు ఎన్నికయ్యారు. ఆయన ఖాళీ చేసిన స్థానంతో పాటు వయనాడ్ స్థానానికి ఒకే సారి ఉప ఎన్నిక జరగనుంది.
మార్క్సిస్టు తికమక
పాలక్కాడ్, చెలక్కర ఉప ఎన్నికలకు అధికారంలో లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ముఖ్యంగా సీపీఎంకు ఓ విషమ పరీక్షే అని చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాల్లో 99 స్థానాలను గెలుచుకుని యూడీఎఫ్ అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ ఉనికిని తిరిగి చెలక్కర స్థానంలో కాపాడుకోవడం చాలా కష్టమైన పని. కేరళలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య తమ సీటును నిలబెట్టుకోవడానకి కమ్యూనిస్టులు తన బలగాన్ని అసాధారణంగా కూడగట్టుకోవాల్సిందే.
లోక్ సభ ఓటమిపై పార్టీ మూడు రోజుల పాటు విస్తృతంగా మేధోమథనం నిర్వహించింది. ఎన్డీఏ పరిపాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత, మైనారిటీల ఓట్లు ఏకమొత్తంలో కాంగ్రెస్ కు వెళ్లడం, దాని వల్లే మైనారిటీ ఓట్లు క్షీణించి ఓటమి పాలైనట్లు నిర్ణయానికి వచ్చారు. పార్టీ ప్రజల సెంటిమెంట్ ను సరిగా అర్థం చేసుకోలేదని, అది ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా మారిందని వారు అంగీకరించారు.
బీజేపీ బలం రోజురోజుకీ..
పాలక్కాడ్‌లో, బీజేపీ బలం రోజురోజుకీ పెరుగుతోంది. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మహిళా నేత శోభా సురేంద్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో పార్టీ మాజీ ఎంపీ ఎన్ఎన్ కృష్ణదాస్ ను మూడో స్థానానికి పరిమితం చేసింది. 2021 ఎన్నికల్లో మెట్రో మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్ ను నిలబెట్టింది. ఆయన దాదాపు గా విజయం సాధించే వాడే కానీ చివరకు షఫీ పరంబిల్ అనే కాంగ్రెస్ నాయకుడు, వామపక్ష నాయకులు క్రాస్ ఓటింగ్ చేయడంతో చాలా తక్కువ మార్జిన్ తో గెలుపొందాడు.
వామపక్షాలు పాలక్కాడ్ నియోజకవర్గంలో ఎలా గెలవాలనే ఆలోచన కూడా చేయకపోవచ్చు. కానీ చెలక్కర మాత్రం వారికి ప్రతిష్టాత్మకం అని చెప్పకతప్పకపోవచ్చు. ఇది వారి సిట్టింగ్ సీటు మాత్రమే కాదు, రాధాకృష్ణన్ 1996 నుంచి వరుసగా ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. ఇది కమ్యూనిస్టులకు నిజంగా పెట్టని కోటే.
ఎర్ర జెండాలన్నీ..
ఎస్సీ, ఎస్టీల కోసం ఈ నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది. ఇక్కడ 1982 లో సీపీఎం తరఫున పోటీ చేసిన చకరపాణి మాత్రమే ఒకసారి గెలిచారు. నిజానికి ఈ ప్రాంతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేది. అయితే 1996 లో యువనాయకుడిగా రాధాకృష్ణన్ బరిలోకి దిగడంతో అక్కడి నుంచి అప్రహాతితంగా ఈ ప్రాంతం మార్క్సిస్టులకు అనుకూలంగా మారింది.
రాధాకృష్ణన్ చెలక్కర నుంచి 1996, 2001, 2006, 2011, 2021లో గెలుపొందారు. 2016లో త్రిసూర్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టడంతో అతని స్థానంలో యుఆర్ ప్రదీప్ వచ్చారు. 2006 నుంచి 2011 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా విజయవంతమైన తర్వాత 2021లో ఆయనను క్యాబినెట్ హోదా కల్పించారు.
చెలక్కర సెగ్మెంట్
2019 లోక్‌సభ ఎన్నికలలో, CPI(M) అలప్పుజా మినహా అన్ని స్థానాలను కోల్పోయింది. చెలక్కర సెగ్మెంట్‌తో కూడిన అలత్తూర్‌లో చాలా రాజకీయ నష్టం జరిగింది. కాంగ్రెస్ యువ అభ్యర్థి రెమ్యా హరిదాస్ 158,968 ఓట్ల తేడాతో అప్పట్లో క్లీన్ ఇమేజ్ ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి పీకే బిజుపై విజయం సాధించారు. సీపీఐ(ఎం) కంచుకోట అయిన చెలక్కరలో కూడా బిజు తక్కువ ఓట్లు సాధించారు. రాధాకృష్ణన్ సొంతగడ్డపై రెమ్య 23,695 ఓట్ల ఆధిక్యం సాధించింది.
రాధాకృష్ణన్ ఒక ఫైటర్
మంత్రి పదవులు కోల్పోయి ఉప ఎన్నికను ఎదుర్కొనే ప్రమాదమున్నప్పటికీ, నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవడంపై ఆయనపై పార్టీ విశ్వాసాన్నిఉంచింది. రాధాకృష్ణన్, ప్రతికూల రాజకీయ పరిస్థితుల మధ్య 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 39,400 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అయితే లోక్ సభ ఎన్నికల్లో కె రాధాకృష్ణన్ కూడా చెలక్కరలో 5,000 ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే సాధించగలిగారనే వాస్తవాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈసారి సీపీఐ(ఎం) ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రజావ్యతిరేకతను సూచిస్తుంది. అలత్తూర్‌లో రాధాకృష్ణన్‌పై ఓడిపోయినప్పటికీ చెలక్కర ఉప ఎన్నికల్లో రమ్య హరిదాస్‌ను పోటీకి దింపాలని యుడిఎఫ్ ఆలోచిస్తోంది, పార్టీ ఇప్పటికే సృష్టించిన ఎన్నికల ఊపును ఉపయోగించుకునే లక్ష్యంతో ఉంది.
ప్రియాంక, బీజేపీ ఎఫెక్ట్
ప్రియాంక గాంధీ వాయనాడ్ ప్రవేశం, రాష్ట్రవ్యాప్తంగా ఆమె సృష్టించగల గణనీయమైన భావోద్వేగ ఆకర్షణ వారి వ్యూహాత్మక అంశాల్లో కీలకమైనవి. బిజెపి కూడా ఆశాజనకంగా ఉంది, వారి లోక్‌సభ అభ్యర్థి టిఎన్ సరసు, రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్, 10 శాతానికి పైగా ఓట్ షేర్‌ను పెంచుకున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కూడా సరసు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆలత్తూరు పోటీకి సమానమైన దృష్టాంతాన్ని అంచనా వేస్తున్నారు, రాధాకృష్ణన్ స్థానంలో 2016లో చెలక్కర ఎమ్మెల్యేగా పనిచేసిన యుఆర్ ప్రదీప్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్-వర్సెస్-బీజేపీ
పాలక్కాడ్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుంది. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్‌ మన్‌కూటత్తిల్‌, లేదా త్రిత్యాల మాజీ ఎమ్మెల్యే వీటీ బలరాం వంటి యువ నేతలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో షఫీ అభ్యర్థిత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి తన అవకాశాలను పునరుద్ధరించడానికి అవకాశం కల్పిస్తుందనే ఆందోళన సర్వత్రా ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి ఈ భయం పెరిగింది.
గత వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో, సీపీఐ(ఎం) గత సంవత్సరం నుంచి పార్టీతో పొత్తుపెట్టుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ రెబల్ ఎవి గోపీనాథ్‌తో ప్రయోగాలు చేయాలని భావించవచ్చు.
మరో నటుడా?
త్రిసూర్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన సినీ నటుడు-రాజకీయవేత్త సురేష్ గోపి విజయంతో ఉల్లాసంగా ఉన్న బిజెపి అలాంటి వారిని రంగంలోకి దింపడానికి మొగ్గు చూపవచ్చు. బలమైన హిందుత్వ ఒరవడి, హిందూ సమాజంలో గణనీయమైన అనుచరులు ఉన్న మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్‌ను వారు ఎంపిక చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈసారి పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో బలమైన పనితీరు కనబరిచిన శోభా సురేంద్రన్ లేదా సి కృష్ణకుమార్ కూడా పోటీకి దింపవచ్చు. వీరికి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ భావిస్తోంది.
వివిధ కారణాల వల్ల వరుసగా సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెలక్కర- పాలక్కాడ్ కీలకంగా మారాయి. చెలక్కరలో ఓడిపోవడం సీపీఐ(ఎం), ముఖ్యంగా పినరయి విజయన్‌కు భారీ ఎదురు దెబ్బ. దీనికి విరుద్ధంగా, 2011 నుంచి వరుసగా గెలుస్తున్న పాలక్కాడ్ సీట్ బీజేపీ గెలిస్తే అది కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే. దీనిలో ఏం జరుగుతుందో చూడాలి.
Read More
Next Story