కర్ణాటక కాంగ్రెస్ SC/ST నేతల సమావేశ వాయిదా
x

"కర్ణాటక కాంగ్రెస్ SC/ST నేతల సమావేశ వాయిదా"

"త్వరలో SC/ST నేతలతో నిర్వహించే కన్వెన్షన్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల రాకపోవడంపై కార్యాచరణ గురించి చర్చిస్తాం" - కర్ణాటక మంత్రి పరమేశ్వర


ఈ రోజు జరగాల్సిన SC/ST నేతల విందు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక (Karnataka) హోం మంత్రి జి పరమేశ్వర (Parameshwara) తెలిపారు. కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి, AICC జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశామని ఆయన తెలిపారు. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు కొత్త తేదీని ప్రకటించి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు..

"ఈ సమావేశాన్ని అగ్రనేతలెవరైనా అడ్డుకున్నారా?" అనే ప్రశ్నకు పరమేశ్వర స్పందించారు. ఈ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించడంలేదని, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని పరమేశ్వర స్పష్టం చేశారు.

దళిత/ST మంత్రులతో విందు సమావేశం కాంగ్రెస్‌(Congress)లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు దారితీసింది. అయితే, పరమేశ్వర ఈ విందు వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. "మేం పార్టీ కోసం పని చేస్తున్నాం. దళిత సామాజిక వర్గ సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం" అని చెప్పారు.

ఇదిలా ఉండగా..డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం రాత్రి ఢిల్లీలో AICC జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్‌(Venugopal)ను కలిసి పార్టీ పరిస్థితుల గురించి చర్చించారు.

"అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిత్రదుర్గలో SC/ST కన్వెన్షన్ నిర్వహించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. వాటిలో చాలా వాటిని పరిష్కరించాం. త్వరలో జరిగే కన్వెన్షన్‌లో కేంద్రం రాష్ట్రానికి నిధుల విడుదల చేయకపోవడంపై చర్చిస్తాం" అని పరమేశ్వర మీడియాతో తెలిపారు. ఈ సమావేశం గురించి పార్టీ సెంట్రల్ లీడర్‌షిప్‌కు తెలియజేయలేదని, ఇది అంతర్గత వ్యవహారమని భావించినట్లు ఆయన చెప్పారు.

Read More
Next Story