Karnataka | న్యూ ఇయర్ వేడుకలకు ఒంటిగంట వరకే అనుమతి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే జరుపుకోవాలని సూచించారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే జరుపుకోవాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించనున్నారు. నగరంపై నిఘా ఉంచేందుకు మొత్తం 11,830 మందిని విధుల్లో ఉంచనున్నట్లు హోం మంత్రి జి పరమేశ్వర సోమవారం తెలిపారు.
"బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. యువకులు జాగ్రత్తగా ఉండాలి. వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.’’ అని సూచించారు.
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ .. నగరవ్యాప్తంగా వెయ్యికి పైగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లర్లకు పాల్పడే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
Next Story