‘కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరుతాం’
x

‘కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరుతాం’

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమన్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా..


వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేరళ(Kerala)లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన శుక్రవారం రాత్రి కేరళ చేరుకున్నారు. శనివారం పుత్తారికండం మైదానంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(UDF)..ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని విమర్శించారు. ఆ రెండూ దేశ విద్రోహ శక్తులకు ఆశ్రయం కల్పించాయని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధితోనే వికాసిత భారత్ సాధ్యమవుతుందన్నారు.


బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడికి నివాళి..

పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం ‘మరార్జీ భవన్‌’ను ప్రారంభించాక.. సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన దివంగత బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేజీ మరార్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర నాయకత్వ సమావేశంలో షా పాల్గొని, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరువనంతపురం నుంచి కన్నూర్‌కు బయలుదేరి, తాలిపరంబాలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Read More
Next Story