
ఆస్తి నష్టంపై జరంగేను అఫిడవిట్ కోెరిన ముంబై హైకోర్టు
జుహు డిపోలో ఓ ప్రయాణికుడిపై దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేసిన మరాఠా హక్కుల కార్యకర్త..
మరాఠా (Maratha) సమాజానికి రిజర్వేషన్ల కల్పించాలని ముంబై(Mumbai)లో మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే(Jarange) నిరాహార దీక్ష (hunger strike) చేపట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2వ తేదీవరకు ఐదు రోజుల పాటు ముంబైలోని ఆజాద్ మైదానంలో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా భారీ సంఖ్యలో మద్దతుదారులు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ముంబైవాసుల ఇబ్బందులపై జోక్యం చేసుకున్న బాంబే హైకోర్టు వెంటనే మైదానాన్ని ఖాళీ చేయాలని జరంగే మద్దతుదారులను ఆదేశించింది. ఈ మేరకు మనోజ్ జరంగే, నిరసనకారులకు సెప్టెంబర్ 2న ముంబై పోలీసులు కోర్టు నోటీసులు అందజేశారు.
ఆందోళనకారులపై కేసు..
ఈ క్రమంలో జరంగే మద్దతుదారులు గత ఆదివారం 7.15 గంటల ప్రాంతంలో ముంబైలోని జుహు డిపోలో ఓ ప్రయాణికుడిపై దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం తెలిసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే నిరసనకారులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దాదాపు 10 మంది గుర్తు తెలియని నిరసనకారులపై కేసు నమోదు చేశారు.
నష్టం ఎవరు కట్టిస్తారు?
మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించిన తర్వాత జరంగే ఆందోళన విరమించారు. ఇదే సమయంలో ఆందోళనకారులు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్థులకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ నష్టం ఎవరు చెల్లి్స్తారని ధర్మాసనం ప్రశ్నించింది. నాలుగు వారాల లోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.