మైసూర్ లోని ఓ రోడ్డుకు ‘ సీఎం సిద్ధరామయ్య’ పేరు
x

మైసూర్ లోని ఓ రోడ్డుకు ‘ సీఎం సిద్ధరామయ్య’ పేరు

తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, ముడా స్కామ్ లో నిందితుడిగా సీఎం పేరు ఉందన్న జేడీఎస్


కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరు మైసూర్ లోని ఓ రోడ్డుకు పెట్టాలనే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మైసూర్ సిటీ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రతిపాదన అర్థరహితమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయం నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఉన్న KRS రోడ్డుకు 'సిద్దరామయ్య ఆరోగ్య మార్గం' అని పేరు పెట్టాలని ప్రతిపాదించింది. చామరాజ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ గౌడ్ సూచన మేరకు మైసూరు నగర కార్పొరేషన్ (ఎంసీసీ) నవంబర్ 22న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశంలో పెట్టడానికి ముందు మైసూరు డిప్యూటీ కమిషనర్ ప్రజల ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనపై 30 రోజుల్లోగా ప్రజల నుంచి అభిప్రాయాలను డిసెంబర్ 13న వార్తాపత్రికలో నోటీసును జారీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూరు.
చారిత్రాత్మక మైసూరులోని కేఆర్‌ఎస్ రోడ్డుకు ‘సిద్దరామయ్య ఆరోగ్య మార్గ’గా నామకరణం చేయడాన్ని జేడీ(ఎస్) ఖండించింది. ముడా స్థల కేటాయింపు కేసులో సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్నారని, లోకాయుక్త పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారని, ప్రతిపక్ష పార్టీ 'X'పై ఒక పోస్ట్‌లో పేర్కొంది.
"మైసూరు సిటీ కార్పొరేషన్‌లో ఎన్నుకోబడిన బోర్డు లేదు. నియమించిన అధికారులు మాత్రమే ఉన్నారు. సిద్ధరామయ్యకు రుణపడి ఉన్నందున అధికారులు ఆ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారు. ముడా కుంభకోణంలో పాలుపంచుకున్న అవినీతిపరుడైన ముఖ్యమంత్రి పేరును రోడ్డుకు పెట్టడం చారిత్రక మైసూరు నగరానికే కాకుండా యావత్ రాష్ట్రానికే ద్రోహం, అవమానం అని జెడి(ఎస్) విమర్శల వర్షం కురిపించింది.
ముడా స్కామ్ ను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ మాట్లాడుతూ.. మహారాజా నల్వాడి కృష్ణరాజా వడియార్ విస్తారమైన భూమిని విరాళంగా అందించారు. క్షయ ఆస్పత్రిని ప్రారంభించారు. అవన్నీ ఆ రోడ్డులోనే ఉన్నాయి. అలాంటి ఉన్న వాటికి సిద్దరామయ్య పేరు పెట్టడం ఏంటనీ ప్రశ్నించారు.
'ముడా కేసులో ముద్దాయిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు పెట్టే అధికారం లేకపోయినా అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై పలువురు పౌరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోని పక్షంలో దానిపై న్యాయపరంగా పోరాడుతామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టులో పేర్కొన్నారు.
సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు, స్వామి వారి నుంచి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చారని, మరికొందరి పేర్లను మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సిద్ధరామయ్య తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.


Read More
Next Story