MUDA కేసు |  సిద్ధరామయ్య దంపతులకు కర్నాటక లోకాయుక్త క్లీన్ చిట్
x

MUDA కేసు | సిద్ధరామయ్య దంపతులకు కర్నాటక లోకాయుక్త క్లీన్ చిట్

ముడా కేసులో కొత్త మలుసు. CBI తో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు భారీ ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూమి కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతీకి లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో దంపతులిద్దరి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవు. భూమి డీనోటిఫికేషన్, కన్వర్షన్ ప్రక్రియ సమయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని, అయితే సిద్ధరామయ్య ఎలాంటి పాత్ర పోషించలేదని తేలింది. MUDA కమిషనర్లు, రెవెన్యూ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు నివేదికలో పేర్కొనడంతో తప్పుచేసిన వారిపై చట్టపర చర్యలకు సలహా కోరినట్లు లోకాయుక్త తెలిపింది.

లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ నేతృత్వంలో కమిటీ MUDA స్కాంపై దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. తుది నివేదికను జనవరి 27 (సోమవారం) న్యాయస్థానానికి సమర్పించనున్నారు. 3.16 ఎకరాల Survey No. 464 లో ల్యాండ్ కన్వర్షన్ దశలన్నింటిని పరిశీలించామని, ఇందులో MUDA 14 సైట్లు పొందినట్లు నిర్ధారణ అయ్యిందని నివేదికలో పొందుపర్చారు. అధికారులే నిబంధనలు పాటించలేదని, సిద్దరామయ్య, ఆయన భార్య ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది.

CM అధికార బలంతో బయటపడ్డారు.. స్నేహమయి కృష్ణ

MUDA స్కాంలో లోకాయుక్త సీఎం సిద్దరామయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రధాన ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ(Snehamayi Krishna) అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా అధికారులు నిబంధనలను ఉల్లంఘించలేరని ఆమె వ్యాఖ్యానించారు. సిద్దరామయ్య తన పలుకుబడి, అధికార బలంతో బయటపడ్డారని, అయితే తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.

సిద్ధరామయ్య స్పందన..

MUDA స్కాంలో లోకాయుక్త (Lokayukta) క్లీన్ చిట్ ఇవ్వడంపై సీఎం సిద్ధరామయ్య స్పందనను తెలుసుకునేందుకు విలేఖరులు ప్రయత్నించారు. తీర్పుపై మీ స్పందనేంటని అడిగిన ప్రశ్నకు.. ఆ విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారు సిద్ధరామయ్య.

సోమవారం ఆ పిటీషన్‌పై తీర్పు..

కేసును CBIకి అప్పగించాలని వచ్చిన పిటిషన్లపై హైకోర్టు(High Court) జనవరి 27 (సోమవారం) తీర్పు ఇవ్వనుంది. లోకాయుక్త అధికారులు అంతకు రోజు ముందురోజు తమ దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read More
Next Story