కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
x

కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నకర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు సీఐడీ అధికారులు ఎలాంటి పరీక్షలు చేయించారు? అసలు సూరజ్ పై నమోదయిన కేసులెన్ని?


ఇద్దరు వ్యక్తులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అధికారులు గతవారం సూరజ్‌కు వైద్యపరీక్షలు చేయించారు. డీఎన్‌ఏ పరీక్ష కోసం నమూనాలను సేకరించిన వైద్యులు సూరజ్‌కు పొటెన్సీ పరీక్ష కూడా నిర్వహించారు.

ఇంతకు కేసేమిటి?

సూరజ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెండు కేసులు నమోదయ్యాయి. తమను సూరజ్ లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్న ఇద్దరు బాధితుల నుంచి సీఐడీ అధికారులు డీఎన్‌ఎ నమూనాలను ఇప్పటికే సేకరించారు.

మొదటి కేసులో జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని హాసన్ జిల్లాకు చెందిన యువకుడు ఆరోపించాడు.

రెండో కేసులో కోవిడ్ సమయంలో తనను లైంగికంగా వేధించాడని 36 ఏళ్ల నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read More
Next Story