ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ‘విప్రో’ కు లేఖ
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ‘విప్రో’ కు లేఖ

ట్రాఫిక్ పీక్ అవర్లలో విప్రో క్యాంపస్ నుంచి వాహానాలు అనుమతించాలని అభ్యర్థించిన సీఎం సిద్ధరామయ్య


బెంగళూర్ ఔటర్ రింగు రోడ్ లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టెక్ దిగ్గజ సంస్థ అయిన ‘విప్రో’ సాయం కోరారు. ఈ విషయానికి సంబంధించి ఐటీ దిగ్గజం వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీకి ఒక లేఖ రాశారు.

పరస్పరం అంగీకరించిన నిబంధనలకు లోబడి, కంపెనీ క్యాంపస్ గుండా పరిమిత వాహనాల రాకపోకలను అనుమతించే విషయాన్ని పరిశీలించాలని సిద్దరామయ్య ప్రేమ్ జీ ని కోరారు. నగరంలోని ఐటీ కారిడార్లలో ఒకటైన ఓఆర్ఆర్ తరుచుగా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతుంది.

బ్లాక్ బక్.. ఓఆర్ఆర్ బయటకు..
ఇటీవల ఆన్ లైన్ ట్రాకింగ్ ప్లాట్ ఫాం బ్లాక్ బక్, ప్రయాణ, రోడ్డు మౌలిక సదుపాయాల సమస్యలను పేర్కొంటూ కంపెనినీ ఓఆర్ఆర్ బెల్లాండూర్ వద్ద ఉన్న ప్రస్తుత స్థానం నుంచి తరలించాలని నిర్ణయించుకుంది. దీనితో సిద్ధరామయ్య ఈ సమస్య పరిష్కారం కోసం నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర ఐటీ పర్యావరణ వ్యవస్థ పురోగతికి మొత్తం సామాజిక ఆర్థిక అభివృద్దికి విప్రో నిరంతర సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ప్రేమ్ జీకి రాసిన లేఖలో సిద్ధరామయ్య ప్రస్తుతం బెంగళూర్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటైన ట్రాఫిక్ సమస్యను ప్రస్తావించారు.
ముఖ్యంగా ఇబ్లూర్ జంక్షన్ లోని ఓఆర్ఆర్ కారిడార్ లో రద్దీ సమయాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఎదుర్కొంటుందని, ఉత్పాదకత, పట్టణ జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హైలైట్ చేశారు.
సిద్ధరామయ్య ప్రేమ్ జీకి రాసినది..
‘‘ఈ సందర్భంలో పరస్పరం అంగీకరించబడిన నిబంధనలు, అవసరమైన భద్రతా పరిగణనలకు లోబడి, విప్రో క్యాంపస్ గుండా పరిమిత వాహానాల రాకపోకలకు అంగీకరించాలని విషయం పరిశీలించాలని కోరుకుంటున్నాను. ట్రాఫిక్, పట్టణ మొబిలిటీ నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. అటువంటి చర్య ఓఆర్ఆర్ ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో రద్దీని దాదాపు 30 శాతం తగ్గించగలదు. ముఖ్యంగా పీక్ అవర్లలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది’’ అని ఆయన సెప్టెంబర్ 19 నాటి లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయంలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ మద్దతును ఆయన కోరుతూ.. ట్రాఫిక్ అడ్డంకులను తగ్గించడంలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో మరింత సమర్థవంతమైన, జీవించగలిగిన బెంగళూర్ కు దోహదపడుతుందని అన్నారు.
‘‘మీ బృందం మా అధికారులతో కలిసి పరస్పర ఆమోదయోగ్యమైన ప్రణాళికను వీలైనంత త్వరగా రూపొందించగలిగితే నేను చాలా కృతజ్ఞుడను’’అని ఆయన అన్నారు.


Read More
Next Story