కేరళ: బీజేపీకి మద్దతు ఇచ్చిన వారిపై సస్పెన్షన్ వేటు
x
మట్టత్తూర్ గ్రామపంచాయతీని గెలుచుకున్న బీజేపీ

కేరళ: బీజేపీకి మద్దతు ఇచ్చిన వారిపై సస్పెన్షన్ వేటు

మట్టత్తూర్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకున్న కమలదళం, కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ రెబెల్స్


త్రిస్సూర్ జిల్లాలోని మట్టత్తూర్ గ్రామపంచాయతీ అధ్యక్షురాలిగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ సభ్యులను ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది.

మట్టత్తూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు పార్టీ నిబంధనలు పట్టించుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీనితో ఆ గ్రామం బీజేపీ వశం అయింది.

ఈ పరిణామంతో అవాక్కయిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపీసీసీ) శనివారం ప్రధాన కార్యదర్శి టీఎం చంద్రన్, మండల అధ్యక్షుడు షఫీ కల్లుపరంబిల్ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది.

‘‘మట్టత్తూర్ గ్రామ పంచాయతీలో పార్టీ నిర్ణయాలను పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా పార్టీని సంక్షోభంలోని నెట్టడానికి ప్రయత్నాలకు నాయకత్వం వహించినందుకు ఈ చర్య తీసుకున్నాం’’ అని కెపీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తిరుగుబాటుదారుల విజయం..
పార్టీ నుంచి రాజీనామా చేసిన కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థి టెస్సీ జోస్ కల్లారక్కల్ పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమెకు ఈ ఓటింగ్ లో పన్నెండు మంది మద్దతుగా నిలిచారు. వారిలో ఎనిమిది మంది కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులవే. మరో స్వతంత్య్ర అభ్యర్థి కేఆర్ ఔసెఫ్ కు 10 మంది ఎల్డీఎఫ్ సభ్యుల మద్దతు లభించింది.
కాంగ్రెస్ తిరుగుబాటుదారుడిగా పోటీ చేసిన అభ్యర్థితో ఎల్డీఎఫ్ పొత్తు పెట్టుకుని పంచాయతీని చేజిక్కించుకోవడానికి ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ రాజకీయ తిరుగుబాటు జరిగింది.
ఎనిమిది మంది సభ్యులు తమ రాజీనామ లేఖలో మండల కాంగ్రెస్ కమిటీ, పార్టీ కార్యకర్తల పట్ల పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వారిలో మినిమోల్, శ్రీజ, సుమా ఆంటోని, అక్షయ్ సంతోష్, ప్రింటో పల్లిపరంబన్, సీజీ రాజేశ్, సీబీ పౌలోస్, నూర్జహాన్ నవాస్ ఉన్నారు.
మట్టత్తూర్ పంచాయతీ గత 23 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ ఆధీనంలోనే ఉంది. ఇటీవల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ పది సీట్లను గెలుచుకుంది. యూడీఎఫ్ ఎనిమిది, బీజేపీ నాలుగు, ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులు గెలిచారు.
ఇందులో తిరుగుబాటు అభ్యర్థులతో కలుపుకుని యూడీఎఫ్, ఎల్డీఫ్ కు చెరో పది సీట్లు దక్కాయి. పోటీ టై దిశగా కదిలిన సమయంలో అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థి వైపు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటు వేశారు.
బీజేపీ మద్దతు గల..
యూడీఎఫ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తిరుగుబాటుదారుడిగా పోటీ చేసి గెలిచిన కేఆర్ ఔసేఫ్ ను తమ పార్టీ నాయకుడిగా, పంచాయతీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకుంది. అయితే ఎన్నికలకు ముందు ఔసేఫ్ ఎల్డీఎఫ్ తో అవగాహన కుదుర్చుకుని తన విధేయతను మార్చుకున్నాడు.
ఈ చర్యతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఔసేఫ్ పచ్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ చర్యకు ప్రతిచర్యగా కాంగ్రెస్ సభ్యులు పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు.
నలుగురు సభ్యులున్న బీజేపీకి మద్దతు తెలిపారు. దీనితో కాషాయ పార్టీ బలం 12 కు చేరింది. గతంలో కాంగ్రెస్ తిరుగుబాటుదారుడిగా గెలిచిన టెస్సీ జోస్ ను పోటీకి దింపారు. ఆమె సునాయాసంగా విజయం సాధించారు.
ఈ పరిణామాలు కాంగ్రెస్ తిరుగుబాటుదారుడు బీజేపీ మద్దతుతో పంచాయతీ అధ్యక్ష పదవిని చేపట్టడంతో పరాకాష్టకు చేరుకున్నాయి. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, బీజేపీ మధ్య పొత్తుపై కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటి వరకూ అధికారిక వైఖరి తీసుకోలేదు. పార్టీకి రాజీనామా చేసిన సభ్యులపై చర్యలు తీసుకోలేదు.


Read More
Next Story