సినీ ఇండస్ట్రీపై హేమ కమిటీ ఎఫెక్ట్, రాజీనామా చేసిన నటులు
కేరళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం హేమ కమిటీ నియమించగా అనేక మంది బాధితులు మెల్లగా బయటకు వస్తున్నారు. తాజాగా..
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై అక్కడి ప్రభుత్వం హేమ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడ తీవ్ర కలకలం చెలరేగింది. ప్రస్తుతం ప్రఖ్యాత మలయాళ చిత్ర నిర్మాత రంజిత్ కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తనతో రంజిత్ అనుచితంగా ప్రవర్తించడని ఓ బెంగాల్ నటుడు తీవ్ర ఆరోపణలు చేశాడు.
దీనితో రంజిత్ తక్షణమే కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్‌కు పంపిన ఆడియో క్లిప్‌లో, రంజిత్ రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వ ప్రతిష్టను ప్రతికూలంగా ప్రభావితం చేసే విధంగా తాను పదవిలో కొనసాగాలని కోరుకోవడం లేదని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడతానని కూడా చెప్పారు. ఈ సంఘటన జరిగడానికి కొన్ని గంటల ముందు సీనియర్ మలయాళ నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.