చైనా వైరస్ పై భయపడాల్సిన పనిలేదు: కేరళ
పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మాస్క్ ధరించాలన్నా ఆరోగ్య మంత్రి
చైనాలో విభృంభిస్తున్న వైరల్ ఫీవర్, శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ విపరీతంగా వ్యాపిస్తోందన్న వార్తలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
ఓ పేస్ బుక్ పోస్టులో... చైనాలో తాజాగా విస్తరిస్తున్న వైరస్ గురించి ఇప్పటి వరకూ ఎటువంటి నివేదికలు రాలేదు. అవి మహమ్మారిగా మారవచ్చు, అలాగే ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో మలయాళీలు ఉన్నారని, అలాగే చైనాలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరంతా తరుచూగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘‘ మేము, మా ప్రభుత్వం పొరుగు దేశం చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఒకవేళ అక్కడ వచ్చిన వ్యాధి ఇతర ప్రాంతాలలో వేగంగా వ్యాప్తి చెందినట్లు అయితే, అలాంటి పరిస్థితే ఇక్కడ తలెత్తవచ్చు. దానిని ఇక్కడ గుర్తిస్తే చాలా త్వరగా తనిఖీ చేయవచ్చు’’ అని చెప్పారు. ప్రజలు ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని కోరారు.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దేశంలోని శ్వాసకోస, కాలనుగుణంగా వస్తున్న ఇన్ప్లుయేంజా కేసులను నిశితంగా పరిశీలిస్తుందని, అలాగే చైనాలో హ్యూమన్ మెటాప్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇటీవల వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు సమాచారం మార్పిడి, పరిణామాలను గమనిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయేల్ మాట్లాడుతూ.. హెచ్ఎంపీవీ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాస కోస వైరస్ లాంటిదని ఇది చిన్న, పెద్దవారిలో ప్లూ లక్షణాలు కలిగిస్తుందని అన్నారు.
Next Story