కర్నాటక: ‘డీకే’ ఎత్తులన్నీ ఎలా చిత్తవుతున్నాయి?
x

కర్నాటక: ‘డీకే’ ఎత్తులన్నీ ఎలా చిత్తవుతున్నాయి?

కర్నాటక లో కాంగ్రెస్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ముగ్గురు ఉపముఖ్యమంత్రులు కావాలని పార్టీలోని వివిధ వర్గాల నాయకులు కోరుతున్నారు.


కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ మధ్య మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తన సోదరుడు డీకే సురేష్ ఓటమి, పార్టీ కూడా పేలవంగా ప్రదర్శన నమోదు చేయడంతో ముభావంగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా కనీసం రెండంకెల స్థాయిలో సీట్లు పొందలేకపోయింది. ఈ ప్రభావం రాష్ట్ర స్థాయి లో డీకే పై నే పడినట్లు తెలుస్తోంది.

పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగ నాయకుడిగా ఎదగాలని, కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీని ఆక్రమించాలని శివకుమార్ చిరకాల వాంఛ క్రమంగా గాలిలో మేడలా మారే స్థితిలో ఉంది. అయినా పట్టు వదలని శివకుమార్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, అతని ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. చివరగా, శివకుమార్ వేరే దారిలోకి వెళ్లి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కలిగ మహా సంస్థాన మఠం అధిపతి చంద్రశేఖర స్వామిజిని ఒప్పించాడు. సీఎం పదవిని సిద్ధరామయ్య వెంటనే వదిలి శివకుమార్ కు అప్పగించాలని కోరారు.
అధికార పోరు తెరపైకి వచ్చింది
ఇది కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లోని ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరును తెరపైకి తెచ్చింది. శాసనసభ్యులు, సిద్ధరామయ్య మద్దతుదారులు ఈ విషయంలో రెండుగా చీలారు. సీఎం విషయంలో సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నేను ఎన్నుకోబడిన సీఎం, నామినేటేడ్ సీఎం ను కాను. కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఈ విషయంలో హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఈ ప్రశ్న అడిగిన ఓ విలేకరిపై విసుక్కున్నాడు.
వొక్కలిగ ప్రాబల్యం ఉన్న దక్షిణ కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంతో కంగుతిన్న శివకుమార్‌.. ఆధిపత్య సామాజికవర్గానికి చెందిన 'అగ్ర' నేతగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దీనికి చన్నపట్నం ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. ఇక్కడ మరొక ఒక్కలిగ నాయకుడు ప్రస్తుత కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. ఇక్కడ గెలిచి జేడీ(ఎస్) ప్రభావాన్ని తగ్గించి, ఒక్కలిగ కులానానికి ఏకైక నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తరువాత ఏమైంది ఏమో కానీ హఠాత్తుగా ఈ ప్రణాళిక నుంచి ఆయన విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు డిప్యూటీ సీఎంలకు పిలుపు
సిద్ధరామయ్యకు సన్నిహితుడైన మంత్రి ఒకరు ఫెడరల్‌తో మాట్లాడుతూ, శివకుమార్ ఎత్తులను అర్థం చేసుకుని ముగ్గురు డిప్యూటీ సీఎంలను దళితులు, ఓబీసీలు, మైనారిటీ వర్గాలకు కేటాయించాలని ఎదురు ఎత్తు వేశారు. దీంతో శివకుమార్ ఎత్తుకు చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతానికి డీకే ఒక్కరే ఈ పదవి అనుభవిస్తున్నారు.
సిద్ధరామయ్యకు విధేయుడిగా కనిపిస్తున్న కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్న మీడియాతో మాట్లాడుతూ క్లుప్తంగా ఈ విషయం చెప్పారు. ‘‘ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. కానీ, ఉపముఖ్యమంత్రుల పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ఇతర సీనియర్ మంత్రులు చలువరాయస్వామి, జి పరమేశ్వర్, హెచ్‌సి మహదేవప్ప కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ సీనియర్ మంత్రుల ప్రకారం, శాసనసభా పక్ష సమావేశంలో సిఎంను ఎన్నుకుంటారు, ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్కకు తప్పుకుని మరొకరికి పదవిని వదిలివేయమని అడగడంలో లేదా సలహా ఇవ్వడంలో కొన్ని పరిణమాలు ఎలాంటి పాత్ర పోషించదు.
వొక్కలిగల 'విందు' సమావేశం
ఈ పరిణామాలు ఇలా కొనసాగుతూ ఉండగానే శివకుమార్, ఒక్కలిగ శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలతో విందు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మద్ధతుకు పెంపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు బయటకు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి ఎందుకు అండగా నిలబడలేదనే వివరాలు సైతం కనుగొంటున్నామని కూడా బయటకు చెప్పారు. ఇదే విషయాన్ని శివకుమార్ సైతం అంగీకరించారు. కర్ణాటకలో 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సామాజికవర్గం సానుభూతిని ఎలా గెలుచుకోవాలో కూడా చర్చించాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో వొక్కలిగ ఆధిక్యత కలిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన తర్వాత, శివకుమార్‌ తన కోల్పోయిన ఇమేజ్‌ని పునరుద్ధరించుకునే ప్రయత్నమేనని శివకుమార్‌ సామాజికవర్గ నేతలతో డిన్నర్‌ మీట్‌ ఏర్పాటు చేశారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. శివకుమార్‌కు అండగా నిలిచిన చన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ మాత్రం తన 'విందు సమావేశం'లో తప్పేమీ లేదని చెబుతున్నారు.
కేపీసీసీ చీఫ్‌ పదవికి ముప్పు
మరో మూడు డిప్యూటీ సీఎంల నియామకంపై అధికార రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల నడుమ, పార్టీ అధ్యక్షుడిగా శివకుమార్ స్థానం కూడా ఊగిసలాటలో కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేపీసీసీ అధ్యక్షుడిని మారుస్తామని పార్టీ హైకమాండ్ సూచించినట్లు సహకార శాఖ మంత్రి రాజన్న ఇటీవల ప్రకటించారు.
పార్టీ హైకమాండ్ గతంలో చేసిన ప్రకటనను రాజన్న ఇటీవల గుర్తు చేశారు. కాగా, శివకుమార్ కూడా కెపిసిసి అధ్యక్షుడిగా ఎంతకాలం కొనసాగుతారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. అతని ప్రకటన పార్టీలో ఉన్న ఆధిపత్య పోరటాన్ని స్పష్టం చేసింది. అయితే శివకుమార్‌కు సన్నిహిత వర్గాలు మాత్రం "కర్ణాటక పార్టీ చీఫ్‌గా అతని స్థానం చెక్కుచెదరకుండా ఉంది. ఈ పదవికి ఎలాంటి పోటీ లేదు. డీకేకు ఎటువంటి ముప్పు లేదు" అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఉప ఎన్నికల్లో చన్నపట్న నుంచి పోటీ చేయకూడదని శివకుమార్ తీసుకున్న నిర్ణయం కూడా తప్పుడు చర్యగా భావిస్తున్నారు. తాను చన్నపట్న ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించి, తరువాత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఎందుకు తప్పుకున్నారో అనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది డీకేపై తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లేందుకు దోహాదం చేసింది.
“కర్ణాటక రాజకీయాల్లో శివకుమార్ తన స్థానాన్ని పునఃస్థాపించుకోవడానికి చేసిన ఈ విఫల ప్రయత్నాలన్నీ అతను పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మెల్లగా తన స్థానాన్ని కోల్పోతున్నట్లు సూచిస్తున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి’’ అని డిప్యూటీ సీఎం సన్నిహితుడు అన్నారు.
Read More
Next Story